నెరవేరిన లతా మంగేష్కర్ చివరి కోరిక.. తిరుమల శ్రీవారికి భారీ విరాళం ఇచ్చిన కుటుంబం..

By Asianet News  |  First Published Oct 10, 2023, 9:28 AM IST

దివంతగ గాయని లతా మంగేష్కర్ చివరి కోరికను ఆమె కుటుంబ సభ్యులు నెరవేర్చారు. టీటీడీకి ఆమె తరఫున కుటుంబ సభ్యులు రూ.10 లక్షల చెక్కును అందజేశారు. ఆమె గతంలో తిరుపతి ట్రస్టు ఆస్థాన సంగీత విద్వాంసురాలిగా పని చేసిన సంగతి తెలిసిందే. 


దివంగత లెజెండరీ గాయని లతా మంగేష్కర్ చివరి కోరిక నెరవేరింది. ఆమె చనిపోయే ముందు తిరుమల శ్రీవారికి విరాళం ఇవ్వాలని చివరి కోరికగా భావించారు. దానిని ఆమె కుటుంబ సభ్యులు తాజాగా నెరవేర్చారు. లతా మంగేష్కర్ తరఫున ఆమె కుటుంబం తిరుమల తిరుపతి దేవస్థానానికి రూ.10 లక్షల విరాళాన్ని అందజేసింది.

నేడు సిఐడి ముందుకు లోకేష్... అరెస్ట్ ప్రచారంతో సర్వత్రా ఉత్కంఠ..!

Latest Videos

లతా మంగేష్కర్ తరఫున రూ.10 లక్షలు విరాళంగా ఇవ్వనున్నట్లు ఆమె కుటుంబం టీటీడీకి రాసిన లేఖలో పేర్కొంది. అలాగే మంగేష్కర్ కుటుంబం తరపున ఆలయానికి విరాళం ఇవ్వాలని కోరుతూ ఆమె సోదరి ఉషా మంగేష్కర్ ముంబైకి చెందిన టీటీడీ బోర్డు సభ్యుడు మిలింద్ కేశవ్ నర్వేకర్ ను వ్యక్తిగతంగా కోరారు. దీంతో వారంతా సోమవారం తిరుమలలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సమక్షంలో విరాళం చెక్కును టీటీడీ కార్యనిర్వహణాధికారి ఏవీ ధర్మారెడ్డికి అందజేశారు.

గుండెపోటుతో ‘మిస్టర్ తమిళనాడు’ టైటిల్ విన్నర్ మృతి.. ఆ పొరపాటే కొంపముంచింది..

కాగా.. గాయని లతా మంగేష్కర్ కు వేంకటేశ్వర స్వామికి పెద్ద భక్తురాలు. ఆమె గతంలో తిరుపతి ట్రస్టు ఆస్థాన సంగీత విద్వాంసురాలిగా కూడా పనిచేశారు. 2010లో ఆమె పాడిన సుమారు 10 తాళ్ళపాక అన్నమాచార్య సంకీర్తనలను టీటీడీ ఎస్.వీ రికార్డింగ్ ప్రాజెక్ట్ రికార్డ్ చేసింది. తరువాత ‘‘అన్నమయ్య స్వర లతర్చన’’ పేరుతో ఆడియో సీడీలుగా టీటీడీ విడుదల చేసింది. 

click me!