దినకర్‌కు సోము వీర్రాజ్ షాక్: బీజేపీ నుండి సస్పెన్షన్

By narsimha lodeFirst Published Oct 20, 2020, 10:51 AM IST
Highlights

పార్టీ నిర్ణయాలు, నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తున్న  లంకా దినకర్ ను పార్టీ నుండి సస్పెండ్ చేసింది బీజేపీ.  టీవీ చర్చా కార్యక్రమాల్లో పార్టీ విధానానికి విరుద్దంగా స్వంత అజెండాను అమలు చేయడంపై బీజేపీ నాయకత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

అమరావతి: పార్టీ నిర్ణయాలు, నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తున్న  లంకా దినకర్ ను పార్టీ నుండి సస్పెండ్ చేసింది బీజేపీ.  టీవీ చర్చా కార్యక్రమాల్లో పార్టీ విధానానికి విరుద్దంగా స్వంత అజెండాను అమలు చేయడంపై బీజేపీ నాయకత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ విషయమై గతంలో బీజేపీ నాయకత్వం షోకాజ్ నోటీస్ జారీ చేసింది. ఈ షోకాజ్ నోటీసుకు సమాధానం ఇవ్వకుండా మళ్లీ షోకాజ్ నోటీసులు ఇవ్వడంపై  పార్టీ నాయకత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ మేరకు ఆయనను పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్టుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మంగళవారం నాడు నిర్ణయం తీసుకొన్నారు.షోకాజ్ నోటీసులపై దినకర్ ఎలాంటి సమాధానం ఇవ్వకపోవడంతో మంగళవారం నాడు ఆయనను పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకొన్నారు.

గతంలో ఆయన టీడీపీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. రాష్ట్రంలో టీడీపీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత దినకర్ టీడీపీని వీడి బీజేపీలో చేరారు. టీడీపీని వీడి బీజేపీలో నలుగురు ఎంపీలు చేరిన సమయంలోనే దినకర్ బీజేపీ తీర్ధం పుచ్చుకొన్నారు.
 

click me!