చంద్రబాబు చేసిన పాపాలకు ప్రతిఫలంగానే ఇప్పుడు జైలు... లక్ష్మీపార్వతి (వీడియో)

Published : Sep 11, 2023, 12:28 PM IST
చంద్రబాబు చేసిన పాపాలకు ప్రతిఫలంగానే ఇప్పుడు జైలు... లక్ష్మీపార్వతి (వీడియో)

సారాంశం

చంద్రబాబునాయుడు అరెస్టైన నేపథ్యంలో ఏపీ తెలుగు అకాడమీ  చైర్ పర్సన్  లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ కు నివాళులర్పించారు. చంద్రబాబు ఇన్నాళ్లు వ్యవస్థల్ని గుప్పిట్లో పెట్టుకుని నాటకాలు ఆడారని విరుచుకుపడ్డారు.   

అమరావతి : చంద్రబాబు అరెస్టుపై ఏపీ తెలుగు అకాడమీ  చైర్ పర్సన్  లక్ష్మీపార్వతి స్పందించారు. స్వయంకృతాపరాధంతోనే చంద్రబాబు జైలు పాలయ్యారని లక్ష్మీపార్వతి అన్నారు. 74 యేళ్ల వయసులో ఎన్టీఆర్ ను దారుణంగా మోసం చేసి.. మానసిక క్షోభతో ఆయన చనిపోయేలా చేశారని…అదే వయసులో ఇప్పుడు చంద్రబాబు నాయుడు జైలు పాలయ్యారన్నారామే. ఎన్టీఆర్ ను మోసం చేసిన ప్రతిఫలమే ఇది అని అన్నారమె. 

లక్ష్మి పార్వతి సోమవారం నాడు ఎన్టీఆర్ ఘట్ లో స్వర్గీయ ఎన్టీ రామారావుకు నివాళులర్పించారు. చంద్రబాబు ఇన్నాళ్లు వ్యవస్థల్ని గుప్పిట్లో పెట్టుకుని నాటకాలు ఆడారని అన్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ… ‘ఇంకా కొన్నేళ్లు ఆరోగ్యంగా జీవించాల్సి వ్యక్తి ఎన్టీఆర్.. ముందుగానే ఆయన బాధతో, అవమానాలతో ఎందుకు చనిపోయారో ఆలోచించాలి. సరిగ్గా ఆయన 74వ ఏటా మీరు చేసిన అవమానాలకు ఆయన గుండె ఆగిపోయింది. 

ఏసీబీ కోర్టుకు సిద్దార్థ లూథ్రా.. కాసేపట్లో చంద్రబాబుకు బెయిల్ కోసం పిటిషన్.. 5రోజుల కస్టడీ కోరుతున్న సీఐడీ

ఇదే 74వ యేట మీరు కూడా ఇదే అవమానాల పరిస్థితి ఎదుర్కొంటున్నారు. అయితే ఆయన అవమానాలు వేరు.. ఆయనకు మీరు చేసింది అన్యాయమైన అవమానాలు. కానీ మీది స్వయంకృతాపరాధం.  మీరు చేసుకున్న పాపాల చిట్టా ఇదంతా కూడా. మీరు చేసిన అవినీతి ఇది. దీన్ని ఏ ఒక్క వ్యక్తో, పార్టీనో, వ్యక్తిగతంగానో చేసిన ఆరోపణలు కాదు కదా. పూర్తిగా నిఘా కేంద్ర సంస్థలు చేసిన కేసు. ఐటీకి సంబంధించి అమరావతికి  సంబంధించి అవకతవకలు జరిగాయని కూడా ఆ సంస్థ బయట పెట్టింది. 

ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో మీరు బయటపడ్డారు. ఇంకా కూడా కేసులు ఉన్నాయి. చాలా కేసులు ఉన్నాయి. పోలవరం, పట్టిసీమకు సంబంధించిన కేసులు ఉన్నాయి. కాగ్ రిపోర్టులు అన్ని బయటపెట్టాయి. ఇలాంటి ఎన్నో అవినీతి కేసులు. అధికారం అంటే, జీవితమంటే ప్రజల్ని దోపిడీ చేయడానికి నా అనే ఒక సందేశాన్ని ఇచ్చిన మీ జీవితంలో ఒక్కసారి వెనక్కి తిరిగి చూడమని నేను తెలియజేస్తున్నాను’  అన్నారమె. 

PREV
click me!

Recommended Stories

ఆ పాపమే నిన్నే వెంటాడుతుంది జగన్ | Chinthamaneni Prabhakar Fires On Ys Jagan | Asianet Telugu
ప్రలోభాలకు లోనై జీవితాలు నాశనం చేసుకోవద్దు | HM Anitha Strong Warning To Constable Candidates