ఎన్టీఆర్ నన్ను ఇల్లీగల్‌గా పెట్టుకున్నారా?.. వెన్నుపోటులో పురందేశ్వరి హస్తం: లక్ష్మీ పార్వతి సంచలనం

Published : Aug 28, 2023, 02:23 PM IST
ఎన్టీఆర్ నన్ను ఇల్లీగల్‌గా పెట్టుకున్నారా?.. వెన్నుపోటులో పురందేశ్వరి హస్తం: లక్ష్మీ పార్వతి సంచలనం

సారాంశం

ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి  పురందేశ్వరిపై వైసీపీ నాయకురాలు, ఏపీ తెలుగు, సంస్కృత అకాడమీ చైర్‌పర్సన్‌ లక్ష్మీ  పార్వతి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటులో చంద్రబాబుతో పాటు పురందేశ్వరిల హస్తం ఉందని ఆరోపించారు.

ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి  పురందేశ్వరిపై వైసీపీ నాయకురాలు, ఏపీ తెలుగు, సంస్కృత అకాడమీ చైర్‌పర్సన్‌ లక్ష్మీ  పార్వతి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటులో చంద్రబాబుతో పాటు పురందేశ్వరిల హస్తం ఉందని ఆరోపించారు. చంద్రబాబు తెరమీద కనిపిస్తే.. అంతర్గతంగా ఎన్టీఆర్‌కు కుటుంబాన్ని దూరం చేసింది పురందేశ్వరి అని ఆరోపణలు చేశారు. తాను ఇంతవరకు ఈ మాట చెప్పలేదని.. ఇప్పుడు స్పష్టంగా చెబుతున్నానని  చెప్పారు. ఎన్టీఆర్ కూడా అందరి  తెలివి ఒక్క పురందేశ్వరికే వచ్చిందని అన్నారని చెప్పుకొచ్చారు. పురందేశ్వరి రాజకీయాల్లోకి రావాలనుకుంటే ఎన్టీఆర్ వద్దన్నారని.. అందుకే తండ్రి చనిపోయిన వెంటనే కాంగ్రెస్‌ పార్టీలో చేరిందని అన్నారు. పురందేశ్వరి రాజకీయ పిచ్చి ఉందని విమర్శించారు.  కాంగ్రెస్ పార్టీ ఓడిపోగానే బీజేపీలో చేరిందని  విమర్శించారు. ఇప్పుడు బావ-మరదలు కలిసి ఏపీలో సీఎం జగన్‌కు వ్యతిరేకంగా  పెద్ద కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. పురందేశ్వరి బీజేపీలో ఉంటూ చంద్రబాబుతో కలిసి పనిచేస్తోందని ఆరోపించారు.

ఎన్టీఆర్ మీద స్మారక నాణెం విడుదల చేయడం సంతోషకరమని చెప్పారు. అయితే ఎన్టీఆర్ భార్యగా తనను ఆహ్వానించకపోవడం  దుర్మార్గం అని అన్నారు. తననుకూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించాలని రాష్ట్రపతికి, ప్రధానికి, ఆర్థికమంత్రి‌కి లేఖ రాశానని.. ప్రభుత్వమే ఈ కార్యక్రమం నిర్వహిస్తే ఎన్టీఆర్ భార్యగా తనను పిలవకపోడం తప్పు అన్నారు. ఈ కార్యక్రమం ఇన్విటేషన్ చూస్తే ప్రైవేటు ఫంక్షన్‌కి రాష్ట్రపతి గెస్ట్‌గా వెళ్తున్నట్టు ఉందని.. ఎన్టీఆర్ భార్యగా తనను పిలవకపవడం అన్యాయం అని లక్ష్మీపార్వతి అన్నారు.

ఎన్టీఆర్ ప్రాణాలు పోవడానికి  కుటుంబ సభ్యులంతా మూకుమ్మడి కారణమని ఆరోపించారు. ఎన్టీఆర్ ప్రాణాలు తీసినవారు ఆయన వారసులుగా.. స్మారక నాణెం విడుదల కార్యక్రమంలో పాల్గొనడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టుగా చెప్పారు. 

తనను ఎన్టీఆర్ వివాహం చేసుకున్నారో లేదో అయన పిల్లలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ భార్యను అని తాను మెడలో ఫోటో పెట్టుకుని తిరగాలా? అని ప్రశ్నించారు. ఎన్టీఆర్‌తో వివాహం అయినట్టు ఫొటోలు, వార్తా కథనాలు ఉన్నాయి. స్వయంగా ఎన్టీఆర్ అనేకసార్లు బహిరంగంగా చెప్పారని తెలిపారు. అయితే తనను ఎన్టీఆర్ పెళ్ళి చేసుకోలేదని.. ఉంచుకున్నారని టీడీపీ ప్రచారం చేస్తుందని విమర్శించారు. ఎన్టీఆర్ నన్ను ఇల్లీగల్‌గా పెట్టుకున్నారా..? పెళ్లి చేసుకున్నారా? చెప్పాలి అంటూ లక్ష్మీపార్వతి ప్రశ్నించారు.

తనకంటే ఎక్కువ అవమానానికి పురంధేశ్వరి గురవుతారని పురందేశ్వరి జోస్యం చెప్పారు. భువనేశ్వరి, పురంధేశ్వరిలు ఇద్దరూ తండ్రికి ద్రోహం చేశారు. కేంద్రం భారతరత్న ఇస్తానుఅంటే పురంధేశ్వరి అడ్డుకుందని.. కేంద్రమంత్రిగా ఉండి అవినీతి చేసిందని ఆరోపించారు. ఈరోజు నుంచి పురంధరేశ్వరి‌పై తాను పోరాటం చేస్తానని చెప్పారు. చంద్రబాబును, పురందేశ్వరిలను రాష్ట్రం నుంచి తరిమికొట్టేలా, ఎన్నికల తర్వాత వారి ముఖాలు కనిపించకుండా.. జగన్‌కు మద్దతుగా  తాను ప్రచారం చేయనున్నట్టుగా చెప్పారు.

ఎన్టీఆర్‌పై నాణెం విడుదల కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్‌కు ఆహ్వానం ఇచ్చారోలేదో నాకు తెలీదని లక్ష్మీపార్వతి అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ వస్తే అక్కడ చంద్రబాబు, జూనియర్ ఎన్టీఆర్‌ను కలపాలని పురంధేశ్వరి ప్రయత్నం చేసిందని ఆరోపించారు. చంద్రబాబు స్క్రిప్ట్‌నే పురంధేశ్వరి చదువుతుందని విమర్శించారు. తాను ఢిల్లీ వెళ్లి ప్రధాని, రాష్ట్రపతిలను కలుస్తానని చెప్పారు. ప్రభుత్వ ఇన్విటేషన్ అయితే జూనియర్ ఎన్టీఆర్ హాజరయ్యేవారని.. ప్రైవేటు ఫంక్షన్ కనుకే జూనియర్ ఎన్టీఆర్ హాజరుకాలేదని లక్ష్మీపార్వతి అన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Odisha Governor Kambhampati Hari Babu Speechవిశాఖలో ఘనంగా మహా సంక్రాంతి వేడుకలు| Asianet News Telugu
CM Chandrababu at Naravaripalli నారావారి పల్లి లో గోమాతకి పూజ చేసిన సీఎం చంద్రబాబు| Asianet Telugu