నా గుండెల్లో మంట చల్లారలేదు.. లక్ష్మీపార్వతి

Published : Jan 18, 2019, 09:38 AM ISTUpdated : Jan 18, 2019, 09:44 AM IST
నా గుండెల్లో మంట చల్లారలేదు.. లక్ష్మీపార్వతి

సారాంశం

ఎన్టీఆర్ ఆత్మ శాంతించలేదని..ఘోషిస్తోందని ఆమె అభిప్రాయపడ్డారు. తన గుండెల్లో మంట చల్లారలేదని..కళ్లలో నీరు ఆగలేదని ఆమె అన్నారు. 

ఎన్టీఆర్ ఎప్పటికీ తెలుగువారి గుండెల్లో ఆరాధ్యుడని ఆయన సతీమణి, వైసీపీ నేత లక్ష్మీ పార్వతి తెలిపారు, సినీనటుడు, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ 23వ వర్థంతి ఈ రోజు. ఈ సందర్భంగా ఆమె ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించింది. అనంతరం మీడియాతో మాట్లాడారు.

ఎన్టీఆర్ ఆత్మ శాంతించలేదని..ఘోషిస్తోందని ఆమె అభిప్రాయపడ్డారు. తన గుండెల్లో మంట చల్లారలేదని..కళ్లలో నీరు ఆగలేదని ఆమె అన్నారు. ఎన్టీఆర్ ని చంపినవాళ్లు యథేచ్ఛగా తిరుగుతున్నారని ఆమె ఆరోపించారు. ఎన్టీఆర్ మహిళలను ఎంతగానో గౌరవించేవారని ఆమె గుర్తు చేస్తున్నారు. కానీ ప్రస్తుతం టీడీపీ నేతలు మహిళలను కించపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

అంతకముందు ఎన్టీఆర్ ఘాట్ వద్ద బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు నివాళులర్పించారు. బాలకృష్ణ మాట్లాడుతూ...ఒక మనిషి మహోన్నతుడు కావాలంటే అకుంఠిత దీక్షకావాలి, సత్సంకల్పం కావాలని, నమ్మిన దారిలో ఎన్ని కష్టాలు ఎదురైనా ముందుకు నడవాలని ఎన్టీఆర్ రుజువు చేశారని బాలకృష్ణ అన్నారు.

ఎంత మంది నాయకులు వచ్చినా, ఎన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన అవన్నీ ఎన్టీఆర్ ముందు చేసినవేనని బాలయ్య వ్యాఖ్యానించారు. లంచగొండితనం ఇష్టం లేక ప్రభుత్వోద్యోగానికి రాజీనామా చేశారన్నారు. సినిమాల్లో ఎదురులేకుండా సాగిన ఆయన రాజకీయాల్లోనూ అంతే స్థాయిలో వెలుగొందారని,పార్టీ పెట్టిన 9 నెలల్లోనే ముఖ్యమంత్రి అయ్యారని గుర్తు చేశారు.

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్