మాజీ మంత్రి అహ్మదుల్లా టీడీపీలో చేరిక

Published : Jan 17, 2019, 07:41 PM IST
మాజీ మంత్రి అహ్మదుల్లా టీడీపీలో చేరిక

సారాంశం

టీడీపీ చీఫ్  చంద్రబాబునాయుడు సమక్షంలో మాజీ మంత్రి అహ్మదుల్లా  గురువారం రాత్రి టీడీపీలో చేరారు. 


అమరావతి: టీడీపీ చీఫ్  చంద్రబాబునాయుడు సమక్షంలో మాజీ మంత్రి అహ్మదుల్లా  గురువారం రాత్రి టీడీపీలో చేరారు. 

2004 ఎన్నికల్లో ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో  అహ్మదుల్లా కాంగ్రెస్ పార్టీ తరపున కడప నుండి పోటీ చేసి విజయం సాధించారు. 2009లో కూడ ఆయన ఇదే స్థానం నుండి విజయం సాధించారు.  2009లో రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించిన అహ్మదుల్లా వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్లో మంత్రిగా పనిచేశారు.

అహ్మదుల్లా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. 2014 ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. 2014 ఎన్నికల్లో ఈ  స్థానం నుండి వైసీపీ అభ్యర్థి అంజద్ బాషా విషయం సాధించారు.

గత ఏడాది నవంబర్ 27వ తేదీన అహ్మదుల్లా తన కొడుకు అష్రఫ్‌తో కలిసి ఏపీ సీఎం చంద్రబాబునాయుడును కలిశారు. వచ్చే ఎన్నికల్లో అహ్మదుల్లా  టీడీపీ అభ్యర్థిగా కడప నుండి పోటీ చేయనున్నారు.గురువారం నాడు అహ్మదుల్లా ఆయన తనయుడు ఆష్రఫ్ టీడీపీలో చేరారు.

సంబంధిత వార్తలు

టీడీపీలోకి మాజీ మంత్రి అహ్మదుల్లా

 

 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu