మ‌హిళ‌లకు ప్ర‌త్యేక బ్యాంకులు

First Published Aug 20, 2017, 3:15 PM IST
Highlights
  • డ్వాక్రా సంఘాలతో సమావేశం అయిన ముఖ్యమంత్రి.
  • ఫైనాన్స్‌ సంస్థల పేరుతో అధిక వడ్డీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవు.
    • మ‌హిళ‌ల‌ అభివృద్ది కోసం ప్ర‌త్యేక బ్యాంకులను ప్రారంభిస్తామని హామీ.

మ‌హిళ‌ల‌ అభివృద్ది కోసం ప్ర‌త్యేక బ్యాంకుల‌ను ఏర్పాటు చేస్తామ‌ని హామీ ఇచ్చారు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు. నంద్యాలలో ఉపఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న చంద్రబాబు ఆదివారం డ్వాక్రా సంఘాలతో సమావేశం అయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఫైనాన్స్‌ సంస్థల పేరుతో అధిక వడ్డీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. త్వ‌ర‌లో ప్రత్యేకంగా మహిళా బ్యాంకులు ఏర్పాటు చేస్తామని చంద్ర‌బాబు తెలిపారు.  

అదేవిధంగా శిల్పా మోహాన్ రెడ్డి పైన కూడా విరుచుకుపడ్డారు. నంద్యాల అభివృద్దికి ఏనాడు శిల్పామోహాన్ రెడ్డి అలోచించ‌లేద‌ని, ఆయ‌న కేవ‌లం ప‌ద‌వుల కోసం మాత్ర‌మే త‌పించారని ఆరోపించారన్నారు. శిల్పా మోహన్‌రెడ్డి కుటుంబం అనేక అక్రమాలకు పాల్పడిందని చంద్రబాబు విమర్శించారు. శిల్పా సహకార సమితిలో రుణాలు తీసుకున్నవారు తిరిగిచెల్లించొద్దని, శిల్పా సహకార సమితి నిర్వహణ చట్టవిరుద్ధమని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.

click me!