నంద్యాల్లో ప్ర‌చారంలో బీకాం ఫిజిక్స్ జ‌లీల్ ఖాన్

Published : Aug 20, 2017, 12:03 PM ISTUpdated : Mar 25, 2018, 11:41 PM IST
నంద్యాల్లో ప్ర‌చారంలో బీకాం ఫిజిక్స్ జ‌లీల్ ఖాన్

సారాంశం

నంద్యాల ఉప ఎన్నిక‌ ప్ర‌చారంలో జలీల్ ఖాన్. తెలుగు దేశం పార్టి నంద్యాల్లో ముస్లిం ఓటర్లను ఆకట్టుకునేందుకు రంగంలోకి. టీడీపీ కి ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞ‌ప్తి.

సోష‌ల్ మీడియాలో బీకాంలో ఫిజిక్స్ చ‌దివాను అనే ఒక్క ప‌దంలో పుల్‌గా పాపుల‌ర్ అయిన ఎమ్మెల్యే జ‌లీల్ ఖాన్‌. ఇప్పడు నంద్యాల ఉప ఎన్నిక‌ ప్ర‌చారానికి దిగారు. అక్క‌డ ఆయ‌న‌ లెక్క‌లు స‌రిచేస్తున్నారు. మరో మూడు రోజుల్లో ఉప ఎన్నిక‌ జరగనునుంది. దీంతో ఇరు పార్టిలు ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. తెలుగు దేశం పార్టి నంద్యాల్లో ముస్లిం ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎమ్మెల్యే జలీల్ ఖాన్‌ను రంగంలోకి దించింది.


ఆదివారం ఉద‌యం ఆయ‌న నంద్యాల ప్ర‌చారంలో భాగంగా రోడ్ షోలో పాల్గోన్నారు. నంద్యాల ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ఆయ‌న ప్ర‌సంగించారు. రాష్ట్రంలో టీడీపీ అభివృద్ది ప‌థంలో దూసుకెళ్లుతుంద‌ని ఆయ‌న పెర్కొన్నారు. నంద్యాల నియోజ‌క‌వ‌ర్గంలో తెలుగు దేశం జెండా ఎగ‌ర‌వేయాల‌న్నారు. అందుకు మీ ఓటుతోనే సాధ్య‌మ‌ని ఆయన పెర్కొన్నారు. నంద్యాల ప్ర‌జ‌లంద‌రు టీడీపీ పార్టీకి అండ‌గా నిలువాల‌ని ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు. జ‌లీల్ ఖాన్ తో చాలా మంది స్థానికులు సెల్పీలు తీసుకున్నారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక ఊపిరి పీల్చుకొండి.. తెలుగు రాష్ట్రాల్లో చలి తగ్గేది ఎప్పట్నుంచో తెలుసా?
నెల్లూరు లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు: Christmas Celebrations in Nellore | Asianet News Telugu