కరోనాకు ప్రైవేట్ పార్ట్స్ నుంచి స్వాబ్ కలెక్షన్.. నీచానికి ఒడిగట్టిన ఓ ల్యాబ్ టెక్నీషియన్.. పదేళ్ల జైలు..

By SumaBala Bukka  |  First Published Feb 4, 2022, 11:53 AM IST

అమ్మాయిల మీద అఘాయిత్యాలకు అంతు లేకుండా పోతోంది. కరోనా మహమ్మారి కూడా ఈ కీచకులను భయపెట్టలేకపోతుంది. పైగా కరోనా టెస్టుల పేరుతో అసభ్యంగా ప్రవర్తించాడో ల్యాబ్ టెక్నీషియన్.. స్వాబ్ కలెక్షన్ పేరుతో నీచంగా వ్యవహరించాడు. చివరికి... 


అమరావతి : corona testల పేరిట నీచంగా వ్యవహరించిన ఒక lab technicianకు ఎట్టకేలకు కఠిన కారాగార శిక్ష పడింది. 
Sample Collectionపేరుతో అభ్యకర రీతిలో వ్యవహరించి కేసులో.. పదిహేడు నెలల తరువాత ఎట్టకేలకు బాధితురాలికి న్యాయం జరిగింది. వివరాల్లోకి వెడితే.. అమరావతి (మహారాష్ట్ర)కి చెందిన యువతి.. స్థానికంగా ఓ మాల్ లో పనిచేస్తోంది.

కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో ఆమె పనిచేసే మాల్ లో పాతిక మందికి పాటిజివ్ నిర్థారణ అయ్యింది. దీంతో మిగతా ఎంప్లాయిస్ తో కలిసి ఆమె కూడా పరీక్షలకు వెళ్లింది. అయితే ఆమెకు పాజిటివ్ వచ్చిందని.. మరిన్ని టెస్టుల కోసం బద్నేరాలోని ల్యాబ్ కు రావాలంటూ సదరు ల్యాబ్ టెక్నీషియన్ (నిందితుడు) ఆ యువతిని రప్పించుకున్నాడు. 

Latest Videos

స్వాబ్ సేకరణలో భాగంగా ఈ సారి శాంపిల్ సేకరణ ప్రైవేట్ పార్ట్ నుంచి చేయాలని చెప్పి... నీచంగా ప్రవర్తించాడు. అయితే ఈ విషయంలో అనుమానం వచ్చి యువతి.. తన సోదరుడికి చెప్పింది. వాళ్లు ఓ డాక్టర్ ను సంప్రదించగా.. కోవిడ్ 19 స్వాబ్ టెస్ట్ ముక్కు, నోటి నుంచిమాత్రమే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. దీంతో బాధితురాలు బద్నేరా పోలీసులను ఆశ్రయించింది. అయినా, నిందితుడిని అరెస్ట్ చేయకపోవడంతో పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. దీంతో జులై 30, 2020న నిందితుడిని బద్నేరా పోలీసులు అత్యాచార ఆరోపణల మీద అరెస్ట్ చేశారు. 

సుమారు పదిహేడు నెలల విచారణ తరువాత.. అమరావతి జిల్లాకోర్టు 12 మంది ప్రత్యక్ష సాక్షులను విచారించి.. ఐపీసీ సెక్షన్ లు 354, 376 ప్రకారం.. పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తున్నట్లు తీర్పు ఇచ్చింది. 

ఇదిలా ఉండగా, ఆపదలో ఉన్న వారిని రక్షించాల్సిన పోలీస్ అధికారి అయి ఉండి మతిస్థిమితం సరిగా లేని యువతిని చెరబట్టిన కామాంధుడికి కోర్టు కఠిన శిక్ష విధించింది. తుమకూరు నగరం వద్ద యువతిపై ఏఎస్ఐ ఉమేశయ్య అత్యాచారం చేసినట్లు నేరం రుజువు కావడంతో అతనికి 20 సంవత్సరాల జైలుశిక్షతో పాటు.. లక్ష రూపాయల జరిమానా విధిస్తూ కోర్టు జడ్జి హెచ్.ఎస్.మల్లికార్జునస్వామి మంగళవారం తీర్పు వెలువరించారు.

ఒంటరి యువతిని చూసి..
2017 జనవరి 14వ తేదీన రాత్రి ఒంటరిగా ఉన్న మతిస్థిమితం లేని యువతిని ఉమేశయ్య గస్తీకి వెళ్ళినప్పుడు చూశాడు. కొంతసేపటికి కారులో వచ్చి యువతిని బెదిరించి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. మరుసటి రోజు ఈ దారుణం యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఉమేశయ్యను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. 

ఉమేశయ్య నేరం చేసినట్టు కోర్టులో రుజువు కావడంతో శిక్ష తప్పలేదు. ప్రభుత్వ న్యాయవాది కవిత పకడ్బందీగా వాదనలు వినిపించారు. బాధితురాలికి  దోషి లక్ష రూపాయల జరిమానా అందించాలని ఆదేశించారు. కాగా, ఉమేశయ్య జీపు డ్రైవర్ పై నేరం నిరూపణ కాకపోవడంతో అతనికి విముక్తి కల్పించారు. ఈ తీర్పుపై ప్రజా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఈ తీర్పు కామాంధులకు గుణపాఠం కావాలని పేర్కొన్నాయి.
 

click me!