ప్రేమించి పెళ్లాడి నెలరోజులైనా గడవకముందే... కట్టుకున్న భార్యను కడతేర్చడానికి భర్త కిరాతకం

Arun Kumar P   | Asianet News
Published : Feb 04, 2022, 11:17 AM ISTUpdated : Feb 04, 2022, 11:31 AM IST
ప్రేమించి పెళ్లాడి నెలరోజులైనా గడవకముందే... కట్టుకున్న భార్యను కడతేర్చడానికి భర్త కిరాతకం

సారాంశం

ఇద్దరి మనసులు కలిసి ఏళ్లుగా ప్రేమించుకున్నారు... కానీ పెళ్లయిన తర్వాత కనీసం నెలరోజులు కూడా కలిసి వుండలేకపోయారు. అంతేకాదు ప్రేమించి పెళ్ళాడిన భార్యనే అతి కిరాతకంగా హతమార్చడానికి ప్రయత్నించాడు ఓ కసాయి. లవ్ మ్యారేజీలపై నమ్మకమే పోగొట్టేలా చోటుచేసుకున్న ఈ దుర్ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. 

ప్రకాశం: వారిద్దరూ చాలాకాలంగా ప్రేమించుకుని ఒకరినొకరు అర్థం చేసుకుని పెళ్లిచేసుకున్నారు. ప్రేమించుకునే సమయంలో వీరిమధ్య వున్న ప్రేమానురాగాలు పెళ్ళయ్యాక కనీసం నెలరోజులు కూడా వుండలేవు. నూతన వధూవరుల మధ్య మనస్పర్థలు పెరిగిపోయాయి. దీంతో ప్రేమించి పెళ్ళాడిన భార్యను అతి కిరాతకంగా కత్తితో పొడిచి చంపాడు ఓ కసాయి భర్త. ప్రేమ పెళ్లిళ్ళపై నమ్మకమే పోయేలా చోటుచేసుకున్న ఈ ఘటన ప్రకాశం జిల్లాలో వెలుగుచూసింది. 

వివరాల్లోకి వెళితే... ప్రకాశం జిల్లా (prakasam district)  దర్శి మండలం పోతవరం గ్రామానికి చెందిన సాయికుమార్ కొన్నేళ్లుగా కొత్తా పావని అనే యువతిని ప్రేమిస్తున్నాడు. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు కాబట్టి వివాహ బంధంతొ ఒక్కటయి జీవితాన్ని పంచుకోవాలని భావించారు.ఈ క్రమంలోనే జనవరి 18వ తేదీన ప్రేమ వివాహం (love marriage) చేసుకున్నారు.  

అయితే పెళ్లయిన కొన్నిరోజులకే భార్యాభర్తల మధ్య విబేధాలు మొదలయ్యాయి. ప్రియుడిగా తనను ఎంతో ప్రేమగా చూసుకున్నవాడు భర్తగా మాత్రం చూసుకోవడం లేదంటూ పావని తీవ్ర ఆవేదనకు గురయ్యింది. అంతేకాదు భర్త వేధింపులకు దిగడంతో భరించలేక పుట్టింటికి వెళ్లిపోయి అక్కడే వుంటోంది. 

ఇలా పెళ్లయి నెలరోజులు కూడా గడవక ముందే భార్య గొడవపడి పుట్టింటికి వెళ్లడం సాయికుమార్ ను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. దీంతో అతడు పుట్టింట్లో వుంటున్న పావని వద్దకు వెళ్లగా ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. ఈ క్రమంలో విచక్షణ కోల్పోయిన సాయి కత్తితో భార్యపై విచక్షణారహితంగా దాడికి తెగబడ్డాడు. దీంతో ఆమె రక్తపుమడుగులో పడిపోగా సాయి అక్కడినుండి పరారయ్యాడు. 

ప్రాణాపాయ స్థితిలో వున్న పావనిని కుటుంబసభ్యులు దగ్గర్లోని హాస్పిటల్ కు తరలించారు. అక్కడినుండి మెరుగైన వైద్యం కోసం ఒంగోలుకు తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా వున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. 

ఈ హత్యాయత్నంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరకుని ఆధారాలను సేకరించారు. అనంతరం బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం నిందితుడు సాయికుమార్ పరారీలో వున్నాడని... అతడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

అయితే ఒకరినొకరు ఇష్టపడి లవ్ మ్యారేజ్ చేసుకున్నాక ఇలా చంపుకునే స్థాయికి ద్వేషం పెరగడం వెనక కారణాలు తెలియాల్సి వుంది. భార్యాభర్తల మధ్య చిన్నచిన్న మనస్పర్దలేనా లేక ఇంకేమయినా కారణాలు వున్నాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

ఇదిలావుంటే మరో వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తూ కట్టుకున్న భర్తనే కడతేర్చింది ఓ కసాయి మహిళ. ఈ దారుణం తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది.  ఘటనలో మృతుడి భార్యతో పాటు ఆమె ప్రియుడు, సహకరించిన మరో ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు. 

పానగల్ కు చెందిన ఇరగదిండ్ల వెంకన్న (41) వ్యవసాయ బావుల తవ్వకం పనులు... అతడి భార్య సుజాత కూలి మేస్త్రిగా చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే సుజాత కూలి పనులకు వెళ్లిన క్రమంలో నార్కట్ పల్లి మండలంలోని చెరువుగట్టుకు చెందిన కప్ప లింగస్వామితో అక్రమ సంబంధం ఏర్పడింది. ఈ విషయం వెంకన్న తెలిసింది. దీంతో అతడి అడ్డు తొలగించుకోవాలని భావించిన సుజాత ప్రియుడితో కలిసి భర్తను కడతేర్చింది.  

PREV
click me!

Recommended Stories

Manyam Collector Presentation on Mustabu Programme | Chandrababu | Collectors | Asianet News Telugu
Sajjala Ramakrishna Reddy Explains | YSRCP One Crore Signatures Campaign | Asianet News Telugu