చంద్రబాబుపై దాడికి కుట్ర: కుటుంబరావు అనుమానం

By ramya NFirst Published Mar 27, 2019, 3:11 PM IST
Highlights

ఏపీ సీఎం చంద్రబాబుపై దాడికి కుట్ర  జరుగుతందేమో అనే అనుమానం కలుగుతోందని ప్రణాళికా సంఘం వైఎస్ ఛైర్మన్ కుటుంబరావు పేర్కొన్నారు.


ఏపీ సీఎం చంద్రబాబుపై దాడికి కుట్ర  జరుగుతందేమో అనే అనుమానం కలుగుతోందని ప్రణాళికా సంఘం వైఎస్ ఛైర్మన్ కుటుంబరావు పేర్కొన్నారు.  బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పలు అనుమానాలను వ్యక్తం చేశారు. ఎన్నికల విధులతో సంబంధం లేని ఇంటెలిజెన్స్ డీజీని బదిలీ చేయడం చట్ట విరుద్ధమని ఆయన అన్నారు.

 ఈ విషయంపై తాము హైకోర్టులో పిటీషన్ వేశామని చెప్పారు. సీఎం భద్రతను పర్యవేక్షించే ఇంటెలిజెన్స్ డీజీని బదిలీ చేశారంటే చంద్రబాబుపై దాడి చేసేందుకు కుట్ర చేస్తున్నారనే అనుమానం కలుగుతోందన్నారు.  చంద్రబాబుకి ఏదైనా జరిగితే పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనన్నారు.

ముఖ్యమంత్రికి ఒక అభద్రతా భావన కలిించాలని, ఆయనపై ఎటాక్ చేయాలని ప్లాన్ జరగుతోందనే అనుమానం ఉందన్నారు. ముఖ్యమంత్రిని చంపేదిశగా చర్య తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అప్పుడింక రాష్ట్రానికి వేరే ఆప్షన్ లేదు కదా అని జగన్‌ను పవర్‌లోకి తీసుకురావడానికి బీజేపీ, ఎలక్షన్ కమిషన్‌తో కలిసి పెద్ద కుట్ర పన్నిందని భావిస్తున్నట్టు కుటుంబరావు తెలిపారు.

click me!