కరోనా ఎఫెక్ట్: కర్నూల్‌ మెడికల్ కాలేజీ హస్టల్ మూసివేత

Published : Jan 11, 2022, 11:14 AM ISTUpdated : Jan 11, 2022, 03:40 PM IST
కరోనా ఎఫెక్ట్: కర్నూల్‌ మెడికల్ కాలేజీ హస్టల్ మూసివేత

సారాంశం

కర్నూల్ జిల్లాలోని మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉన్న హస్టల్ ను మూసివేశారు. ఈ హస్టల్ లో ఉన్న పలువురు మెడికల్ విద్యార్ధులకు కరోనా సోకింది. దీంతో ఈ హస్టల్ ను మూసివేస్తున్నట్టుగా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రకటించారు.

కర్నూల్: kurnool  ప్రభుత్వ మెడికల్ కాలేజీలో పలువురు వైద్య విద్యార్ధులకు corona సోకింది. దీంతో medical college కి అనుబంధంగా ఉన్న hostel ను మూసివేస్తున్నట్టుగా అధికారులు ప్రకటించారు. ఈ నెల 17వ తేదీ వరకు హస్టల్‌ను మూసివేస్తున్నామని మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ తెలిపారు.

గత ఏడాది కూడా ఇదే హస్టల్ లో పనిచేసే వంట మనిషితో పాటు వంట మనిషికి సహాయంగా పనిచేసే వారికి కరోనా సోకింది. దీంతో వైద్య విద్యార్ధులు కూడా కరోనా బారినపడ్డారుు. హస్టల్ ను శానిటైజేషన్ చేశారు. కరోనా బారినపడిన విద్యార్ధులను హోం ఐసోలేషన్ లో ఉంచారు.  ఈ సమయంలో ఈ మెడికల్ కాలేజీకి అనుబంద:గా ఉన్న హస్టల్ లో 70 మంది వైద్య విద్యార్ధులున్నారు. 

గత వారంలో ఏపీలోని కర్నూలు జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లో  కరోనా కలకలం రేపుతోంది.  మెడికల్ కాలేజ్‌లో 50 మంది వైద్య విద్యార్థులకు, వైద్య సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 11 మంది విద్యార్థులకు, నలుగురు హౌస్ సర్జన్‌లకు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. కరోనా సోకిన 11 మంది విద్యార్థులు ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. 

మెడికల్ కాలేజ్ లోని విద్యార్థులకు కరోనా సోకడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. మరో 40 మంది వైద్య విద్యార్థుల నుంచి శాంపిల్స్ సేకరించిన వైద్య సిబ్బంది వాటిని పరీక్షల నిమిత్తం ల్యాబ్ కు పంపారు. కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయిన వారిని ఐసోలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.  

Andhra pradesh రాష్ట్రంలో సోమవారం నాడు 984 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా కేసుల  వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకొంది. సోమవారం నుండి రాష్ట్రంలో Night curfew ను అమల్లోకి తీసుకొచ్చింది ఏపీ ప్రభుత్వం.  సినిమా థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీతో నడపాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.

India లో గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 1,68,063 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి భారత్‌తో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,58,75,790కి చేరింది. ఈ మేరకు మంగళవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బులిటెన్ విడుదల చేసింది. అయితే తాజాగా నమోదైన కేసులు కిందటి రోజు నమోదైన కేసుల సంఖ్య కంటే 6.5 శాతం తక్కువగా ఉన్నాయి. ఇక గత 24 గంటల్లో కరోనాతో 277 మంది మృతిచెందారు. 

దీంతో మొత్తం మరణాల సంఖ్య 4,84,213కి చేరింది. తాజాగా కరోనా నుంచి 69,959 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 3,45,70,131కి చేరింది. ప్రస్తుతం దేశంలో 8,21,446 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా రోజువారి పాటిజివిటీ రేటు 10.64 శాతంగా ఉంది. 

కొత్తగా నమోదైన కరోనా కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 33,470, పశ్చిమ బెంగాల్‌లో 19,286, ఢిల్లీలో 19,166, తమిళనాడులో 13,990, కర్ణాటకలో 11,698 కేసులు నమోదయ్యాయి. ఇక, దేశంలో నిన్న 15,79,928 శాంపిల్స్‌ను పరీక్షించినట్టుగా Icmr తెలిపింది. ఇప్పటివరకు భారత్‌లో మొత్తంగా 69,31,55,280 శాంపిల్స్‌కు పరీక్షించినట్టుగా పేర్కొంది. 

దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది. దేశంలో నిన్న 92,07,700 డోసుల వ్యాక్సిన్ పంపిణీ జరిగింది. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,52,89,70,294కు చేరింది. 

PREV
click me!

Recommended Stories

Chandrababu Power Full Speech: అనకాపల్లిలో స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమం| Asianet News Telugu
Kandula Durgesh Super Speech: Amarajeevi Jaladhara Scheme Foundation Ceremony | Asianet News Telugu