కర్నూలు జిల్లాలో రైతుకు దొరికిన విలువైన వజ్రం.. రూ. 20 లక్షలకు విక్రయం..!

By Sumanth KanukulaFirst Published Aug 3, 2022, 11:09 AM IST
Highlights

కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలో ప్రతి ఏడాది వజ్రాల వేట భారీగానే సాగుతుంది. వర్షాలు పడటం ప్రారంభం కాగానే.. చాలా మంది పొలాల వెంబడి తిరుగుతూ వజ్రాల వేట సాగిస్తారు. 

కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలో ప్రతి ఏడాది వజ్రాల వేట భారీగానే సాగుతుంది. వర్షాలు పడటం ప్రారంభం కాగానే.. చాలా మంది పొలాల వెంబడి తిరుగుతూ వజ్రాల వేట సాగిస్తారు. తొలకరి వర్షాలు పడిన వెంటనే మండల వాసులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి అనేక మంది ఇక్కడకు వచ్చి వజ్రాల కోసం వెదికే పనిలో నిమగ్నమయ్యారు. ప్రతి ఏటా ఐదు నుంచి పది దాకా వజ్రాలు దొరుకుతున్నట్లు సమాచారం. తుగ్గలి మండలంలో  జొన్నగిరిలో.. గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులు.. పొలాల్లో వజ్రాల వేట మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే జొన్నగిరికి చెందిన ఓ రైతు మంగళవారం ఉదయం పొలంలో  పనిచేసుకుంటుండగా వజ్రం దొరికింది.

అయితే ఆ వజ్రాన్ని ఓ వ్యాపారి రూ. 20 లక్షలకు కొనుగోలు చేసినట్టుగా తెలుస్తోంది. అయితే బహిరంగ మార్కెట్‌లో దాని విలువ రూ.40 లక్షల దాకా ఉండవచ్చని వ్యాపార వర్గాల అంచనా వేస్తున్నాయి. జొన్నగిరి ప్రాంతంలో వజ్రాలు దొరకడం, వాటిని వ్యాపారులు కొనుగోలు చేయడం సర్వసాధారణ విషయని స్థానికులు చెబుతున్నారు.  

ఇక, ఈ ఏడాది బహిరంగంగానే 8 మందికి వజ్రాలు లభించాయని.. మరో 12 వజ్రాలను వ్యాపారులు రహస్యంగా కొనుగోలు చేశారని కొందరు స్థానికుల నుంచి వినిపిస్తున్న మాట. మొత్తంగా 15 కోట్ల విలువైన వజ్రాలు చేతులు మారినట్టుగా ప్రచారం జరుగుతుంది. 

click me!