టీడీపీలో కర్నూలు సీటు చిచ్చు: అటు ఎస్వీ ఇటు టీజీ మధ్యలో లోకేష్

By Nagaraju penumalaFirst Published 17, Feb 2019, 11:23 PM IST
Highlights

కర్నూలు అసెంబ్లీ టికెట్ పై ఇరువురు వెనక్కి తగ్గడం లేదు. టీజీ వెంకటేశ్ తనయుడు భరత్ ఒక అడుగు ముందుకు వెయ్యడంతో ఎస్వీ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి నారా లోకేష్ ను మధ్యలో తీసుకువచ్చారు. 
 

కర్నూల్: కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం టికెట్ పై రాజకీయ పోరు జరుగుతోంది. నిన్న మెున్నటి వరకు టికెట్ తమదంటే తమదే అని ప్రకటించుకున్న కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి, టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్ లు రూట్ మార్చారు. 

కర్నూలు అసెంబ్లీ టికెట్ పై ఇరువురు వెనక్కి తగ్గడం లేదు. టీజీ వెంకటేశ్ తనయుడు భరత్ ఒక అడుగు ముందుకు వెయ్యడంతో ఎస్వీ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి నారా లోకేష్ ను మధ్యలో తీసుకువచ్చారు. 

మంత్రి నారా లోకేష్ కర్నూలు నుంచి పోటీ చేస్తే తాను మద్దతు ఇస్తానని ఇక పోటీ చెయ్యనని హామీ ఇచ్చారు. అలా కాకుండా వేరొకరికి ఇస్తే ఒప్పుకోనంటూ టీజీపై పరోక్షంగా మండిపడ్డారు. ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డికి ఎంపీ టీజీ వెంకటేష్ ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు. 

తెలుగుదేశం పార్టీ ఎస్వీ, టీజీ కుటుంబాల ఆస్తి కాదని ఓటర్ల ఆస్తి అని చెప్పుకొచ్చారు. మంత్రి లోకేశ్ పోటీ చేస్తే ఎస్వీ మోహన్ రెడ్డి మద్దతిస్తానంటున్నారని ఆయన ఒక్కరే ఏంటి తామంతా మద్దతు ఇస్తామన్నారు. 

ఎస్వీ మోహన్ రెడ్డి ఒక్కే మద్దతు ఇస్తామని ప్రకటించి సరికాదన్నారు. ఎస్వీ మోహన్ రెడ్డి టికెట్ అంశంపై మాయమాటలు చెప్తూ జనాలను తికమక పెడుతున్నారంటూ ధ్వజమెత్తారు. గెలిచే అభ్యర్థికే చంద్రబాబు టికెట్ ఇస్తారన్న విషయం ఎస్వీ మోహన్ రెడ్డి తెలుసుకోవాలన్నారు. సర్వేల ప్రకారమే టికెట్లు కేటాయించడం చంద్రబాబుకు ఆనవాయితీ అని టీజీ వెంకటేశ్ స్పష్టం చేశారు.  

 

Last Updated 17, Feb 2019, 11:23 PM IST