kurnool Assembly elections result 2024 live : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు దళిత ముఖ్యమంత్రిగా సేవలందించిన దామోదరం సంజీవయ్య ఇక్కడి నుంచి గెలిచిన తొలి ఎమ్మెల్యే . కర్నూలులో కాంగ్రెస్ పార్టీ 7 సార్లు, టీడీపీ రెండు సార్లు, సీపీఎం రెండు సార్లు, వైసీపీ రెండు సార్లు , స్వతంత్రులు ఒకసారి విజయం సాధించారు. 1952లో నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి కర్నూలు అన్ని పార్టీలను, అన్ని వర్గాలను ఆదరించింది. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో రెడ్లు , ముస్లిం మైనారిటీలు, బలిజ, దళిత వర్గాల ప్రాబల్యం అధికం. మాజీ ఐఏఎస్ ఇంతియాజ్ వైసీపీలో చేరిన వెంటనే ఆయనను కర్నూలు అభ్యర్ధిగా ప్రకటించారు. టీడీపీ విషయానికి వస్తే.. ఆ పార్టీ కర్నూలులో గెలిచి దాదాపు 25 ఏళ్లు కావొస్తోంది.
kurnool Assembly elections result 2024 live : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కర్నూలుది ప్రత్యేక స్థానం. రాయలసీమలో అతిపెద్ద నగరంగా , ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని కర్నూలు విలసిల్లింది. ఉమ్మడి రాష్ట్రంలోనూ, నవ్యాంధ్రలోనూ కర్నూలు రాజకీయాలు ప్రత్యేకం. ఇక్కడ సీజన్‌తో సంబంధం లేకుండా పొలిటిక్స్ హాట్ హాట్‌గా సాగుతాయి. ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో కర్నూలు రాజకీయాలు పూటకొక రకంగా మారుతున్నాయి. 1952లో నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి కర్నూలు అన్ని పార్టీలను, అన్ని వర్గాలను ఆదరించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు దళిత ముఖ్యమంత్రిగా సేవలందించిన దామోదరం సంజీవయ్య ఇక్కడి నుంచి గెలిచిన తొలి ఎమ్మెల్యే. 1952లో కాంగ్రెస్ టికెట్‌పై గెలిచిన ఆయన కర్నూలుకు మొట్టమొదటి ఎమ్మెల్యేగా చరిత్రలో నిలిచిపోయారు.
కర్నూలు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 ..
undefined
కర్నూలులో కాంగ్రెస్ పార్టీ 7 సార్లు, టీడీపీ రెండు సార్లు, సీపీఎం రెండు సార్లు, వైసీపీ రెండు సార్లు , స్వతంత్రులు ఒకసారి విజయం సాధించారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో రెడ్లు , ముస్లిం మైనారిటీలు, బలిజ, దళిత వర్గాల ప్రాబల్యం అధికం. కర్నూలు నగరం మొత్తం ఈ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోకి వస్తుంది. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి అబ్ధుల్ హఫీజ్ ఖాన్‌కు 72,819 ఓట్లు.. టీడీపీ అభ్యర్ధి టీజీ భరత్‌కు 67,466 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా వైసీపీ 5,353 ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది.
కర్నూలు శాసనసభ ఎన్నికల ఫలితాలు 2024 ..
2024 ఎన్నికల విషయానికి వస్తే.. మైనారిటీలపై జగన్ గురిపెట్టారు. వారిని తనవైపు తిప్పుకునే ప్రయత్నాల్లో భాగంగా 2019లో ప్రయోగం చేసిన జగన్ ఈసారి కూడా అదే అస్త్రం ప్రయోగిస్తున్నారు. మాజీ ఐఏఎస్ ఇంతియాజ్ వైసీపీలో చేరిన వెంటనే ఆయనను కర్నూలు అభ్యర్ధిగా ప్రకటించారు. ఆయనకు సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, ఎస్వీ మోహన్ రెడ్డిలు కూడా మద్ధతు పలికారు. టీడీపీ విషయానికి వస్తే.. ఆ పార్టీ కర్నూలులో గెలిచి దాదాపు 25 ఏళ్లు కావొస్తోంది. 1999 ఎన్నికల్లో తెలుగుదేశం చివరిసారిగా విజయం సాధించింది. తాజా ఎన్నికల్లో టీజీ భరత్‌కు చంద్రబాబు టికెట్ కేటాయించారు.