రాజధానిపై రెఫరెండం...మరి రాజీనామాలు చేయాల్సిందే ఎవరంటే: మంత్రి కన్నబాబు

By Arun Kumar PFirst Published Aug 2, 2020, 7:20 AM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులకు గవర్నర్ ఆమోదం లభించడంతో మరోసారి ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. 

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ రాజధాని వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులకు గవర్నర్ ఆమోదం లభించడంతో మరోసారి ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. ప్రతిపక్ష పార్టీలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే అధికార పార్టీ దీన్ని స్వాగతిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాజధాని అంశంపై రెఫరెండం నిర్వహించాలని... అమరావతి ప్రాంతంలోని వైసిపి ఎమ్మెల్యేలంతా రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని టిడిపి డిమాండ్ చేస్తోంది. ఈ డిమాండ్ మంత్రి కురసాల కన్నబాబు స్పందించారు. 

రెఫరెండం నిర్వహించాలని కోరుతున్నది టిడిపి కాబట్టి ఆ పార్టీ వారే రాజీనామాలు  చేసి ఎన్నికలకు వెళ్లాలని సూచించారు. అప్పుడు వారికి ఎన్ని సీట్లు వస్తాయో, వారి బలమేంటో తెలుస్తుందన్నారు మంత్రి కన్నబాబు. 

read more   మోదీ ఆశీర్వదించారు, పేదలపై కక్ష సాధింపా.. సోమిరెడ్డి ఫైర్

ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర భవిష్యత్, భావితరాల కోసం మూడు రాజధానుల  నిర్ణయం తీసుకున్నారని  అన్నారు. ఈ నిర్ణయానికి గవర్నర్ కూడా ఆమోదం తెలపడం  శుభపరిణామన్నారు. ఇకపై రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో సమాన అభివృద్ది సాధ్యమవుతుందని పేర్కొన్నారు. పరిపాలనా రాజధానిగా విశాఖ ప్రపంచంలోనే గొప్ప నగరంగా తయారవుతుందన్నారు. 

అయితే అమరావతి పేరిట చంద్రబాబు మరిన్ని కుట్రలు పన్నే అవకాశం వుందని అన్నారు.  గుంటూరు, చిత్తూరు తదితర జిల్లాలలో ఎమ్మెల్యేలు ఆందోళన చేస్తారని...చంద్రబాబు రాజీనామా చేస్తారని లీకులు ఇస్తున్నారు. అంతేకాకుండా గవర్నర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ కుట్రలన్నింటికి చంద్రబాబు కేంద్ర బిందువు అని కన్నబాబు ఆరోపించారు. 
 

click me!