నెల్లూరులో దారుణం: దంపతుల హత్య, బంగారు ఆభరణాలు చోరీ

Published : Aug 28, 2022, 11:47 AM IST
నెల్లూరులో దారుణం: దంపతుల హత్య, బంగారు ఆభరణాలు చోరీ

సారాంశం

నెల్లూరులో కృష్ణారావు, సునీత దంపతులు హత్యకు గురయ్యారు. నిందితులు ఇంట్లోని బంగారు ఆభరణాలను దోచుకున్నారు. ఈ హత్యలకు ముందు నిందితులు రెక్కీ నిర్వహించారని పోలీసులు అనుమానిస్తున్నారు. కృష్ణాీరావు నివాసంలో ఆధారాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

నెల్లూరు: పట్టణంలోని మినీ బైపాస్ రోడ్డులోని ఆశోక్ నగర్ లో శనివారం నాడు రాత్రి దంపతులను హత్య చేశారు గుర్తు తెలియని దుండగులు., అంతేకాదు ఇంట్లోని బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. శనివారం నాడు రాత్రి సునీత, కృష్ణారావు దంపతులు నివాసం ఉంటున్న ఇంట్లోకి వచ్చిన దుండగులు వారిని హత్య చేశారు. ఇంట్లోని బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. కృష్ణారావు ఇంట్లో లేని సమయంలో ఆయన భార్య సునీతను హత్య చేశారని పోలీసులు చెబుతున్నారు. అయితే అదే సమయంలో ఇంటికి వచ్చిన కృష్ణారావును కూడా దుండగులు హత్య చేశారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇవాళ ఉదయం కృష్ణారావు ఇంటికి పాలు ఇచ్చేందుకు వచ్చిన వ్యక్తి   ఇంటి గుమ్మం వద్దే కృష్ణారావు రక్తం మడుగులో పడి ఉండడంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

నెల్లూరు పట్టణంలోని విద్యుత్ శాఖ కార్యాలయం వద్ద కృష్ణారావు హోటల్ ను నిర్వహిస్తున్నాడు. ప్రతి రోజూ ఆయన తన హోటల్ లో వచ్చే ఆదాయాన్ని తీసుకు వస్తాడు. శనివారం నాడు కృష్ణారావు తన హోటల్ నుండి డబ్బులు తీసుకుని వచ్చాడు. శనివారం నాడు రాత్రి కృష్ణారావు  ఆలస్వంగా ఇంటికి చ్చాడు. అయితే అప్పటికే బెడ్ రూమ్ లోఉన్న కృష్ణారావు భార్య సునీతను దుండగులు హత్య చేశారు. ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు దోచుకున్నారు.  అదే సమయంలో కృష్ణారావు ఇంటికి వచ్చి తలుపు తట్టాడు.

ఈ విషయాన్ని గుర్తించిన దుండగులు అతడిని హత్య చేశారని పోలీసులు గుర్తించారు.  ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కృష్ణారావు నివాసంలో ఆధారాల కోసం ప్రయత్నిస్తున్నారు. మరో వైపు కృష్ణారావు ఇంటికి సమీపంలోని సీసీటీవీ పుటేజీలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. కృష్ణారావు ఇంట్లో దాడికి  నిందితులు రెక్కీ నిర్వహించారని పోలీసులు అనుమానిస్తున్నారు. కృష్ణారావు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఇది బాబుగారి మాటగా చెబుతున్న | Atchennaidu On Local Body Elections | Asianet News Telugu
Heavy Rain Alert : బంగాళాఖాతంలో తుపాను లోడ్ అవుతోందా? ఈ ప్రాంతాల్లో అతిభారీ వర్షాలతో అల్లకల్లోలం తప్పదా?