కలెక్టర్ ఇంతియాజ్ కు విశ్వగురు అంతర్జాతీయ కరోన వారియర్ అవార్డ్ (వీడియో)

Arun Kumar P   | Asianet News
Published : Mar 07, 2021, 01:23 PM ISTUpdated : Mar 07, 2021, 01:25 PM IST
కలెక్టర్ ఇంతియాజ్ కు విశ్వగురు అంతర్జాతీయ కరోన వారియర్ అవార్డ్ (వీడియో)

సారాంశం

 కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ విశ్వ గురు వరల్డ్ రికార్డ్స్ సంస్థ ''కరోనా వారియర్ అంతర్జాతీయ అవార్డు'' ను అవార్డుకు అందుకున్నారు. 

విజయవాడ: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సంక్లిష్ట సమయంలో ప్రజలకు, వలస కార్మికులకు, కరోనా బాధితులకు అత్యుత్తమంగా సేవలందించిన కృష్ణా జిల్లా కలెక్టర్ ఏ.యండి. ఇంతియాజ్ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికయ్యారు. ఆయన సేవలను గుర్తించి హైదరాబాదుకు చెందిన విశ్వ గురు వరల్డ్ రికార్డ్స్ సంస్థ ''కరోనా వారియర్ అంతర్జాతీయ అవార్డు'' ను విజయవాడ  కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అందించారు.  ఆ సంస్థ ఫౌండర్, సి.ఎం.డి రాంబాబు, సంస్థ కమిటీ సభ్యులు యాదయ్య గౌడ్, సుందరపల్లి గోపాలకృష్ణ, కృష్ణా జిల్లా కో- ఆర్డినేటర్ కళ్యాణి కలిసి ఇంతియాజ్ ను శాలువతో సత్కరించి అవార్డును ప్రధానం చేశారు.

 కరోన విపత్కర పరిస్థితులలో జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలను సమన్వయంతో చైతన్య పరుస్తూ... వారితో ఇంతియాజ్ మమేకమయ్యారని రాంబాబు పేర్కొన్నారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ క్షేత్రస్థాయిలో పర్యటించి కరోనా బాధితులకు, వారి కుటుంబాలకు ఆపద సమయంలో నేనున్నానని మనోధైర్యం కల్పించారన్నారు. ఇలా సేవలందించడం వలనే ఈ అవార్డును అందించడం జరిగిందని సత్యవోలు రాంబాబు తెలిపారు.

వీడియో

 ఈ సందర్భంగా కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ... ఈ అవార్డును అందుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. విదినిర్వహణలో భాగంంగా తాను చేసిన సేవలను గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేసినందుకు విశ్వగురు సంస్థకు ధన్యవాదాలు తెలిపుతున్నానని అన్నారు. ఈ అవార్డ్  పొందడం తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు.  ప్రజలకు మరింత సేవ చేయడానికి పునరంకితం అవుతానని కలెక్టర్  ఇంతియాజ్ అన్నారు.

ఈ కార్యక్రమంలో  జాయింట్ కలెక్టర్(సంక్షేమం)  కె.మోహన్ కుమార్, డిఆర్ డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు, శ్రీధర్, సుధీర్ రమణ, సురేష్ తదితరులు పాల్గొన్నారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!