విజయవాడలో బాబు ఎన్నికల ప్రచారం: కేశినేని నాని దూరం

Published : Mar 07, 2021, 12:36 PM IST
విజయవాడలో బాబు ఎన్నికల ప్రచారం: కేశినేని నాని దూరం

సారాంశం

విజయవాడలో చంద్రబాబు టూర్ కి ఎంపీ కేశినేని నాని దూరంగా ఉన్నారు. నాని ఈ టూర్ లో పాల్గొంటే తాము ఈ టూర్ కి దూరంగా ఉంటామని  వైరి వర్గం ప్రకటించిన నేపథ్యంలో ఈ టూర్ కి నానిని దూరంగా ఉంటున్నారు.

విజయవాడ: విజయవాడలో చంద్రబాబు టూర్ కి ఎంపీ కేశినేని నాని దూరంగా ఉన్నారు. నాని ఈ టూర్ లో పాల్గొంటే తాము ఈ టూర్ కి దూరంగా ఉంటామని  వైరి వర్గం ప్రకటించిన నేపథ్యంలో ఈ టూర్ కి నానిని దూరంగా ఉంటున్నారు.విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్  మేయర్ పదవిని దక్కించుకోవడానికి టీడీపీ నాయకత్వం సర్వశక్తులు ఒడ్డుతోంది.

also read:పార్టీ నేతల నమ్మకాన్ని వమ్ము చేయను: కేశినేని శ్వేత

అయితే విజయవాడ ఎంపీ కేశినేని నానికి, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, అధికార ప్రతినిధి  నాగుల్ మీరాలు  మధ్య వైరం నెలకొంది. 

చంద్రబాబు టూర్ ను కూడ బహిష్కరిస్తామని శనివారం నాడు అసంతృప్త నేతలు ప్రకటించారు. దీంతో కేశినేని శ్వేత రాయబారం నడిపింది. దీంతో మేయర్ ఎన్నికల్లో శ్వేతకు సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నట్టుగా ఈ ముగ్గురు నేతలు ప్రకటించారు. 

అయితే చంద్రబాబు టూర్ లో నాని పాల్గొంటే తాము ఈ ప్రచారానికి దూరంగా ఉంటామని  ఈ ముగ్గురు నేతలు ప్రకటించడంతో పార్టీ నాయకత్వం కూడ ముందు జాగ్రత్తలు తీసుకొంది.

ఆదివారంనాడు చంద్రబాబునాయుడు విజయవాడలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ప్రచారంలో మేయర్ అభ్యర్ధి కేశినేని శ్వేత పాల్గొన్నారు. ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్  హాజరయ్యారు. కానీ  విజయవాడ ఎంపీ కేశినేని నాని మాత్రం హాజరు కాలేదు.టీడీపీ చీఫ్ చంద్రబాబు సూచన మేరకే నాని ఈ ప్రచారానికి దూరంగా ఉన్నారనే ప్రచారం టీడీపీ వర్గాల్లో సాగుతోంది. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Motivational Speech: Superman కాదు.. Hanuman గురించి చెప్పండి | Asianet News Telugu
Chandrababu, Mohan Bhagwat Attends Bharatiya Vigyan Sammelan Inaugural Session | Asianet News Telugu