అధిక ఫీజులు: విజయవాడ లిబర్టీ ఆసుపత్రిపై చర్యలు

Published : Sep 13, 2020, 11:55 AM IST
అధిక ఫీజులు: విజయవాడ లిబర్టీ ఆసుపత్రిపై చర్యలు

సారాంశం

కృష్ణా జిల్లాలో మరో ఆసుపత్రిపై కలెక్టర్ చర్యలు తీసుకొన్నారు. నిబంధనలకు విరుద్దంగా ఫీజులు వసూలు చేశారని ఫిర్యాదు మేరకు విచారణ చేసిన జిల్లా కలెక్టర్ ఈ మేరకు ఆదివారం నాడు ఆదేశాలు జారీ చేశారు.


విజయవాడ: కృష్ణా జిల్లాలో మరో ఆసుపత్రిపై కలెక్టర్ చర్యలు తీసుకొన్నారు. నిబంధనలకు విరుద్దంగా ఫీజులు వసూలు చేశారని ఫిర్యాదు మేరకు విచారణ చేసిన జిల్లా కలెక్టర్ ఈ మేరకు ఆదివారం నాడు ఆదేశాలు జారీ చేశారు.

విజయవాడలోని లిబర్టీ ఆసుపత్రిలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని రాజమండ్రికి చెందిన ఓ మహిళ కలెక్టర్ కు ఫిర్యాదు చేసింది.రాజమండ్రికి చెందిన ఓ వ్యక్తి కరోనా చికిత్స కోసం లిబర్టీ ఆసుపత్రిలో చేరాడు. ఈ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ విషయమై బాధిత మహిళ  ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. 

also read:ఇండియాలో కరోనా జోరు: మొత్తం కేసులు 47,54,357కి చేరిక

లక్ష రూపాయాలు వసూలు చేసి కూడ తన భర్త ప్రాణాలను కాపడలేదని ఆమె ఆరోపించింది.ఈ విషయమై బాధితురాలు చేసిన ఫిర్యాదు మేరకు జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు.

త్రిసభ్య కమిటి ఈ ఘటనపై విచారణ నిర్వహించింది.  లిబర్టీ ఆసుపత్రిలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న విషయం వాస్తవమేనని త్రిసభ్య కమిటీ తేల్చింది.  ఈ నివేదిక ఆధారంగా  లిబర్టీ ఆసుపత్రిలో కరోనా వైద్యం చేయడంపై నిషేధం విధిస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆసుపత్రులను  వేరే ఆసుపత్రికి తరలించాలని కూడ కలెక్టర్ ఆదేశించారు.

PREV
click me!

Recommended Stories

AP Telangana Weather Alert: ఏపీ, తెలంగాణలో మరో 6 రోజులు దంచికొట్టనున్న వర్షాలు
మావి కుటుంబాలు కాదా చంద్రబాబు రెచ్చిపోయిన జోగి | Jogi Ramesh Family Issue