కోయంబేడ్ దెబ్బ: ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు

By narsimha lode  |  First Published May 13, 2020, 12:37 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోవడం వెనుక కోయంబేడు మార్కెట్ లింకులు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయంతో ఉంది.ఈ విషయమై కోయంబేడ్ మార్కెట్ కు వెళ్లిన వారి గురించి రాష్ట్ర ప్రభుత్వం ఆరా తీస్తోంది. 


అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోవడం వెనుక కోయంబేడు మార్కెట్ లింకులు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయంతో ఉంది.ఈ విషయమై కోయంబేడ్ మార్కెట్ కు వెళ్లిన వారి గురించి రాష్ట్ర ప్రభుత్వం ఆరా తీస్తోంది. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు ఎక్కువగా నమోదౌతున్నాయి. చిత్తూరు జిల్లాలో కూడ కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు కావడంపై ప్రభుత్వం ఆరా తీస్తోంది. చిత్తూరు జిల్లా నుండి కోయంబేడ్ మార్కెట్  కు వ్యాపారులు, రైతులు వెళ్లిన విషయం అధికారుల దృష్టికి వచ్చింది.

Latest Videos

undefined

also read:పోతిరెడ్డిపాడుపై వివాదాస్పద జీవోలు: నాడు వైఎస్ఆర్, నేడు జగన్

చిత్తూరు జిల్లాలో కరోనా కేసులు పెరగడడానికి కోయంబేడ్ కూడ ప్రధాన కారణమని ఏపీ వైద్య ఆరోగ్య శాఖాధికారులు అభిప్రాయంతో ఉన్నారు. ఈ విషయమై  విచారణ చేస్తున్నారు.

చిత్తూరు, నెల్లూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో కొత్తగా నమోదైన కరోనా కేసుల్లో ఎక్కువగా కోయంబేడ్ లింకులేనని అధికారులు గుర్తించారు.

గుంటూరు జిల్లా నుండి కోయంబేడ్ మార్కెట్ వెళ్లి వచ్చిన వారిని గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. ఇప్పటివరకు సుమారు 140 లారీ డ్రైవర్లు, క్లీనర్లు కోయంబేడ్ వెళ్లి వచ్చినట్టుగా అధికారులు గుర్తించారు. వీరిలో 50 మందిని క్వారంటైన్ కు  తరలించారు.

కోయంబేడ్ వెళ్లి వచ్చిన వారికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. వీరిలో ఎవరికైనా కరోనాగా తేలితే  ఇప్పటివరకు వారు ఎవరెవరిని కలిశారు.. ఎక్కడెక్కడ తిరిగారనే విషయాలపై కూడ అధికారులు ఆరా తీయనున్నారు.
 

click me!