కేసీఆర్ చేతులునాకిన జగన్ రాయలసీమ బిడ్డో, కాదో: అయ్యన్నపాత్రుడు సంచలనం

Arun Kumar P   | Asianet News
Published : May 13, 2020, 12:00 PM IST
కేసీఆర్ చేతులునాకిన జగన్ రాయలసీమ బిడ్డో, కాదో: అయ్యన్నపాత్రుడు సంచలనం

సారాంశం

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ప్రాజెక్టు చిచ్చు పెట్టిన విషయం తెలిసిందే. ఈ వివాదంపై మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఘాటుగా స్పందించారు. 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టినసప్పటి నుండి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుతో మంచి స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. అయితే తాజాగా వీరిద్దరి మద్య పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ చిచ్చు పెట్టింది.  పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంచాలనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయం ఇరువురు ముఖ్యమంత్రుల మధ్య విభేదాలకు దారి తీసే పరిస్థితి ఏర్పడింది. 

ఈ నేపథ్యంలో ఇద్దరు ముఖ్యమంత్రుల అనుబంధం గురించి గతంలో గొప్పగా చెప్పిన ఎంపీ విజయసాయి రెడ్డిపై మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సెటైర్లు విసిరారు. సోషల్ మీడియా వేదికన ఇరువురు తెలుగు ముఖ్యమంత్రుల అనుంబంధంపై సంచలన కామెంట్స్ చేశారు. 

''ఎంపీ విజయసాయి రెడ్డి గారు మొన్నటివరకూ కేసీఆర్-జగన్ ది తండ్రి, కొడుకుల అనుబంధం అన్నారు, ఇరు రాష్ట్రాల మధ్యా జల వివాదాలు తొలగిపోయాయి అన్నారు,ఇరు రాష్ట్రాలు కలిసి ఉమ్మడి ప్రాజెక్టులు చేపడుతున్నాయ్ అంటూ'' 
 
''కేసీఆర్ గారి చేతిని నాకిన వైఎస్ జగన్ గారు రాయలసీమ బిడ్డో, కాదో... అసలు జగన్ ఏపీకి చెందిన వ్యక్తో, కాదో నువ్వే తేల్చాలి సాయి రెడ్డి గారు. నాన్నకి కోపం వచ్చింది అని మెత్తబడతారా? మెడలు వంచి నీళ్లు సాధిస్తారా?'' అని విజయసాయి రెడ్డిని ప్రశ్నిస్తూ అయ్యన్నపాత్రుడు ట్వీట్ చేశారు. 


 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?