టీడీపీ సర్పంచ్‌కు సహకరించొద్దు.. వైసీసీ వాళ్లు చెప్పిన పనే చేయాలి: అధికారులకు నల్లపురెడ్డి హుకుం

Siva Kodati |  
Published : Aug 07, 2021, 06:51 PM IST
టీడీపీ సర్పంచ్‌కు సహకరించొద్దు.. వైసీసీ వాళ్లు చెప్పిన పనే చేయాలి: అధికారులకు నల్లపురెడ్డి హుకుం

సారాంశం

వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్‌రెడ్డి తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు పెద్దఎత్తున చేపట్టిన వైసీపీ అభ్యర్థిని ఓడించి టీడీపీ సర్పంచి అభ్యర్థిని గెలిపిస్తారా? అంటూ ప్రజలపై మండిపడ్డారు

మొన్నామధ్య జగనన్న ఇళ్లలోని బెడ్ రూమ్స్‌లో పెళ్లయిన కొత్త జంటలకు శోభనానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుందని వ్యాఖ్యానించి దుమారం రేపిన వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్‌రెడ్డి తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు పెద్దఎత్తున చేపట్టిన వైసీపీ అభ్యర్థిని ఓడించి టీడీపీ సర్పంచి అభ్యర్థిని గెలిపిస్తారా? అంటూ ప్రజలపై మండిపడ్డారు.

Also Read:మంచమే పట్టదు.. కొత్త జంటలకు కాపురం కూడా కష్టమే: జగనన్న ఇళ్లపై నల్లపురెడ్డి వ్యాఖ్యలు

శనివారం ఇనుగూరుపేట మండలం పల్లెపాడు జిల్లా డైట్‌ కళాశాలలో అభివృద్ధి పనులపై ప్రసన్నకుమార్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. టీడీపీ సర్పంచికి గానీ, ఇంకెవరైనా నాయకులకు గానీ ఎలాంటి పనులు చేయడానికి వీల్లేదని అధికారులకు వార్నింగ్ ఇచ్చారు. గ్రామంలో స్థానిక వైసీపీ నాయకుడు కుమార్‌ రెడ్డి చెప్పిందే చేయాలని ప్రసన్నకుమార్ రెడ్డి ఆదేశించారు. మండలంలోని ఇతర వైసీపీ నాయకులు చెప్పినా చేయొద్దు అని అధికారులకు హుకుం జారీ చేశారు. మండలంలోని దేవిస్‌పేట, కొత్తూరు, పున్నూరు, పల్లెపాడు గ్రామాల్లో టీడీపీ సర్పంచి అభ్యర్థుల్ని గెలిపించడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి వ్యాఖ్యలతో సమావేశంలో పాల్గొన్న అధికారులు ఆశ్చర్యపోయారు.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?