ఏపీలో కొత్తగా 1908 మందికి కరోనా పాజిటివ్.. తూర్పుగోదావరిలో తగ్గని తీవ్రత

Siva Kodati |  
Published : Aug 07, 2021, 05:52 PM IST
ఏపీలో కొత్తగా 1908 మందికి కరోనా పాజిటివ్.. తూర్పుగోదావరిలో తగ్గని తీవ్రత

సారాంశం

ఏపీలో కొత్తగా1908 కరోనా కేసులు నమోదవ్వగా.. 22 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజు 2103 మంది కోలుకోగా.. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 20,375 మంది చికిత్స పొందుతున్నారు.  

ఆంధ్రప్రదేశ్‌‌‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1908 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 19,77,363కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల 22 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 13,513కి చేరుకుంది.

గత 24 గంటల వ్యవధిలో కోవిడ్ బారినపడి ప్రకాశం 2, అనంతపురం 2, తూర్పుగోదావరి 2, నెల్లూరు 2, శ్రీకాకుళం 2, చిత్తూరు 3, కృష్ణ 4, గుంటూరు 3, విశాఖపట్నం 1, పశ్చిమ గోదావరిలో ముగ్గురు చొప్పున మరణించారు. నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 2103 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 19,43,475కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 80,376 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 2,51,08,146కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 20,375 మంది చికిత్స పొందుతున్నారు.

నిన్న ఒక్కరోజు అనంతపురం 42, చిత్తూరు 231, తూర్పుగోదావరి 438, గుంటూరు 216, కడప 82, కృష్ణ 192, కర్నూలు 26, నెల్లూరు 213, ప్రకాశం 186, శ్రీకాకుళం 53, విశాఖపట్నం 81, విజయనగరం 29, పశ్చిమ గోదావరిలలో 119 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.  


 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu