
కర్నూలు జిల్లాలోని కోడుమూరులో ఫ్యాక్షన్ మరోసారి పడగ విప్పింది. మాజీ కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అనుచరుడు సిద్దప్పను ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. షణ్ముకరెడ్డి నగర్‌లో సిద్దప్పపై ప్రత్యర్థులు వేట కొడవళ్లతో దాడి చేశారు. మాటువేసి దాడికి పాల్పడ్డారు. వేట కొడవళ్లతో తలపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన సిద్దప్పను ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందతూ సిద్దప్ప మృతిచెందాడు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. 2008లో జరిగిన వెంకటప్పనాయుడు హత్య కేసులో సిద్దప్ప ముద్దాయిగా ఉన్నాడు. సిద్దపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు.