పవన్, చంద్రబాబుతో కలిసి వెళ్లడానికి సిద్దం.. ఆ విషయంలో పవన్ క్లారిటీ ఇవ్వాలి: సీపీఐ రామకృష్ణ

By Sumanth KanukulaFirst Published Oct 19, 2022, 12:50 PM IST
Highlights

జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భేటీపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి స్పందించారు. పవన్-చంద్రబాబుతో కలిసి వెళ్లడానికి తాము సిద్దంగా ఉన్నట్టు చెప్పారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భేటీపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి స్పందించారు. పవన్-చంద్రబాబుతో కలిసి వెళ్లడానికి తాము సిద్దంగా ఉన్నట్టు చెప్పారు. బీజేపీ విషయంపై పవన్ కల్యాణ్ క్లారిటీ ఇవ్వాలని కోరారు. వైసీపీని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కౌగిలించుకుంటున్నారని విమర్శించారు. ఏం చేయలేని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పోరాడితే ఎంత.. పోరాడకుంటే ఎంత అని ఎద్దేవా చేశారు. 

ఇక, పవన్ కల్యాణ్ విశాఖ పర్యటనలో చోటుచేసుకున్న పరిణామాలతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. విజయవాడలోని నోవాటెల్ హోట్‌లో పవన్ కల్యాణ్‌తో చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి టీడీపీ, జనసేన కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్టుగా నేతలు చెప్పారు. అధికార వైసీపీ వ్యతిరేకంగా రెండు పార్టీలు కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నప్పటికీ.. రాష్ట్రంలో జనసేనకు మిత్రపక్షం బీజేపీయేనని పవన్ చెప్పారు. ఆదివారం విశాఖపట్నంలో ర్యాలీకి అనుమతి నిరాకరించిన నేపథ్యంలో నటుడు-రాజకీయవేత్తతో నాయుడు సమావేశం 

రాష్ట్రంలోని ప్రాథమిక హక్కులు, భావ ప్రకటనా స్వేచ్ఛను వైసీపీ ప్రభుత్వం అడ్డుకుంటోందని పవన్, చంద్రబాబు ఆరోపించారు. ప్రభుత్వ చర్యల వల్ల ఏ పార్టీకి ఇబ్బంది కలిగిన ఉమ్మడి వేదికపైకి వచ్చి పోరాడాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో అరాచక పరిస్థితుల నేపథ్యంలో సీపీఐ, సీపీఎం, బీజేపీ, టీడీపీ సహా అన్ని పార్టీలు ప్రజాస్వామ్యాన్ని బతికించేందుకు కలిసి పోరాడాలని పవన్ విజ్ఞప్తి చేశారు. వైసీపీ అరాచకాలపై పార్టీలన్ని కలిసి పోరాడాల్సిన అంశంపై పవన్‌తో చర్చించానని.. అన్ని పార్టీలతోనూ మాట్లాడతానని చంద్రాబు అన్నారు. 

click me!