రెయిన్ గన్ వ్యవసాయానికా, వ్యాపారానికా?

First Published Nov 3, 2016, 11:18 AM IST
Highlights

 వ్యవసాయమోమోగాని, రెయిన్ గన్ల కొనుగోలు, నిర్వహణలో తెలుగుదేశం నేతలు బాగా బిజినెస్ చేసుకున్నారని కోట్ల అంటున్నారు.

పొలం వదలి పోరాటానికి వస్తున్న కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి 

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రెయిన్ గన్ లతో రాయలసీమలో పంటలను కాపాడాడో లేక ఎండగట్టాడో ఈ ప్రాంతానికి వచ్చి చూడాల్సిందిగా రాజకీయ నాయకులను మాజీ కేంద్ర మంద్రి కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి ఆహ్వనించారు. రెయిన్ గన్ లత్ రైతులను, లక్షలాది ఎకరాలలో పంటను కాపాడానని ముఖ్యమంత్రి చెప్పుకోవడం మోసం అని ఆయన అన్నారు.

 

2014 ఎన్నికల తర్వాత కర్నూలు జిల్లాకే పరిమితమయిన సూర్య ప్రకాశ్ రెడ్డి గురువారం నాడు  హైదరాబాద్ లో పార్టీ ఆంధ్ర ప్రదేశ్ కార్యాలయం ఇందిరా భవన్ లోవిలేకరులతో మాట్లాడారు. రెయిన్ గన్‑ల వల్ల రాయలసీమలో ఎక్కడా పంటలు పండలేదని కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తెలిపారు. కాకపోతే, రెయిన్ గన్ల కొనుగోలు, నిర్వహణలో తెలుగుదేశం నేతలు బాగా బిజినెస్ చేసుకున్నారని వ్యాఖ్యానించారు.

 

ఈ రహస్యాన్ని ప్రజల ముందుంచేందుకు నవంబర్ 19 వ తేదీన కర్నూల్ జిల్లా కోడుమూరులో భారీ రైతు మహాసభను ఏర్పాటుచేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. గత రెండున్నరేళ్లుగా రైతులను చంద్రబాబు నాయుడు బాగా చిన్న చూపు చూస్తున్నాడని ఆయన ఆరోపించారు. రైతులకు గురించి మాట్లాడే హక్కు సూర్యప్రకాశ్ కున్నంత మరొక రాజకీయ నాయకుడికి ఉండదు. ఎందుకంటే, చాలా మంది రాజకీయ నాయకుల్లాగా, ఎన్నికల్లో ఓడిపోయాక రాజధానికి పరిమతం కాకుండా ఆయన సొంతవూరు లద్దగిరిలో వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు. అవసరమయినపుడల్లా క్రియాశీల రాజకీయాల్లోకి వస్తున్నారు.

 

రెయిన్ గన్ల వల్ల రైతులకేమీ ఒరగ లేదని, రైతుల సమస్యలు ఏవీ తీరలేదని చెప్పెందుకే  కోడుమూరు సభని నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. 1995-2004 మధ్య వ్యవసాయం దండగ అని చంద్రబాబు తీసిన దెబ్బనుంచి ఆంధ్రరైతు ఇంకా కోలుకోలేదని,  ఇపుడు మళ్లీ రెయిన గన్ మోసం బారిన పడుతున్నాడని కోట్ల అన్నారు.



 

click me!