
కొత్తపేట రాజకీయాలు :
ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో కొత్తపేటకు ఓ ప్రత్యేక స్థానం వుంది. ఈ నియోజకవర్గంలో మొదటినుండి కాంగ్రెస్ దే హవా... ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత వైసిపి హవా మొదలయ్యింది. వైసిపి ఆవిర్భావం తర్వాత పోటీచేసిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొత్తపేటలో వైసిపిదే విజయం.
కొత్తపేట రాజకీయాలను మొదటినుండి చీర్ల కుటుంబం శాసిస్తోంది. టిడిపి ఆవిర్భావం తర్వాత జరిగిన మొదటి ఎన్నికల్లో కొత్తపేట నుండి చీర్ల సోమసుందర రెడ్డి పోటీచేసి గెలిచారు. ఆ తర్వాత చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ చేరిన సోమసుందర్ 1989 ఎన్నికల్లో పోటీచేసి గెలిచారు. తండ్రి రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తూ 2004 లో చీర్ల జగ్గిరెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పోటీచేసి గెలిచారు. ఆ తర్వాత వైఎస్ జగన్ వెంటనడుస్తూ వైసిపిలో చేరిన జగ్గిరెడ్డి 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వరుస విజయాలు సాధించారు.
కొత్తపేటలో టిడిపి కూడా బలంగానే వుంది. బండారు సత్యానందరావు 1994, 1999 అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి నుండి పోటీచేసి గెలిచారు. ఆ తర్వాత 2009 లో ప్రజారాజ్యం పార్టీ నుండి గెలిచారు. గత రెండు ఎన్నికల్లోనూ సత్యానందరావు పోటీచేసినా జగ్గిరెడ్డి చేతిలో ఓడిపోయారు. అయినప్పటికీ బండారు సత్యానందరావుపై నమ్మకం వుంచిన టిడిపి మరోసారి బరిలోకి దింపుతోంది.
కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని మండలాలు :
1. రావులపాలెం
2. ఆత్రేయపురం
3. ఆలమూరు
4. కొత్తపేట
కొత్తపేట అసెంబ్లీ ఓటర్లు :
నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య (2019 ఎన్నికల ప్రకారం) - 2,41,645
పురుషులు - 1,20,694
మహిళలు - 1,20,940
కొత్తపేట అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు :
వైసిపి అభ్యర్థి :
సిట్టింగ్ ఎమ్మెల్యే చీర్ల జగ్గిరెడ్డినే మరోసారి కొత్తపేట బరిలో నిలిపేలా కనిపిస్తోంది వైసిపి. వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనకే ముచ్చటగా మూడోసారి అవకాశం దక్కేలా వుంది.
టిడిపి అభ్యర్థి :
తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావును కొత్తపేట అభ్యర్థిగా ప్రకటించింది. ఆయన గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినప్పటికీ మళ్ళీ అవకాశం దక్కింది.
కొత్తపేట అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు :
కొత్తపేట అసెంబ్లీ ఎన్నికలు 2019 ఫలితాలు :
నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 2,03,625 (84 శాతం)
వైసిపి - చీర్ల జగ్గిరెడ్డి - 82,645 (40 శాతం) - 4,038 ఓట్ల మెజారిటీతో విజయం
టిడిపి - బండారు సత్యానందరావు - 78,607 (38 శాతం) - ఓటమి
జనసేన పార్టీ - బండారు శ్రీనివాసరావు - 35,833 (17 శాతం)
కొత్తపేట అసెంబ్లీ ఎన్నికలు 2014 ఫలితాలు :
నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,88,051 (84 శాతం)
వైసిపి - చిర్ల జగ్గిరెడ్డి - 88,357 (46.99 శాతం) - 713 ఓట్ల మెజారిటీతో విజయం
టిడిపి - బండారు సత్యానందరావు - 87,644 (46.61 శాతం)