పి.గన్నవరం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

By Arun Kumar PFirst Published Mar 15, 2024, 3:05 PM IST
Highlights

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మరో నియోజకవర్గం పి. గన్నవరం.  ప్రస్తుతం ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొండేటి చిట్టిబాబు కొనసాగుతున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే 2024 ఎన్నికల్లోనూ ఇక్కడ వైసిపి, టిడిపిల మధ్యే పోటీ వుంది. అయితే టిడిపి పార్టీ దళిత నాయకుడు మహాసేన రాజేష్ కు పి.గన్నవరం బరిలో దింపడం పొలిటికల్ హీట్ పుట్టించింది. అయన అభ్యర్థిత్వాన్ని హిందూ ధార్మిక సంఘాలు వ్యతిరేకిస్తూ ఆందోళనలకు దిగడంతో గందరగోళం నెలకొంది. ఇదే సమయంలో దళిత వర్గాలు రాజేష్ కు అండగా నిలుస్తున్నారు. దీంతో పి. గన్నవరంలో ఎలక్షన్ రిజల్ట్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.  

పి. గన్నవరం రాజకీయాలు : 

ఆంధ్ర ప్రదేశ్ లోని ఎస్సీ రిజర్వుడ్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాత గన్నవరం ఒకటి. ఈ నియోజకవర్గ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేలా ఎస్సీ ఓట్లు వుంటాయి. దీంతో బలమైన దళిత నేతలను ఈ నియోజకవర్గ బరిలో నిలిపాయి వైసిపి, టిడిపి. 

దళితవర్గాలకు అండగా 'మహాసేన' సంస్థను స్థాపించి చాలాకాలం సామాజిక ఉద్యమాన్ని నడిపారు సరిపెళ్ల రాజేష్. అయితే ఇటీవల టిడిపి పార్టీలో చేరిన ఆయనకు ఈసారి పి. గన్నవరం సీటు కేటాయించారు చంద్రబాబు. టిడిపి మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత పులిపర్తి నారాయణమూర్తి మృతితో పి. గన్నవరం సీటు రాజేష్ కు దక్కింది. అయితే ఆయన అభ్యర్థిత్వంపై హిందూసంఘాలు భగ్గుమంటున్నాయి... గతంలో హిందూ అమ్మాయిలపై అతడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో తనవల్ల టిడిపికి చెడ్డపేరు రాకూడదు.... కాబట్టి తాను పి.గన్నవరం పోటీనుండి తప్పుకోడానికి సిద్దమైనని రాజేష్ ప్రకటించాడు. కానీ టిడిపి అదిష్టానం మాత్రం అతడిని తప్పించలేదు. 

మరోవైపు పి. గన్నవరం వైసిపిలో కూడా ఆందోళనకర పరిస్థితులు వున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే  కొండేటి చిట్టిబాబను తప్పించి విప్పర్తి వేణుగోపాల్ ను పి.గన్నవరం అభ్యర్థిగా ప్రకటించింది వైసిపి. దీంతో చిట్టిబాబు వర్గం అదిష్టానంపై తీవ్ర అసంతృప్తితో వుంది. 

పి. గన్నవరం నియోజకవర్గ పరిధిలోని మండలాలు : 

1. పి. గన్నవరం 
2. అంబాజీపేట
3. అయినమిల్లి 
4. మామిడికుదురు ( కొన్ని గ్రామాలు)

పి. గన్నవరం అసెంబ్లీ ఓటర్లు : 

నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య (2019 ఎన్నికల ప్రకారం) ‌-  1,95,237
పురుషులు - 96,683
మహిళలు ‌- 98,643

పి. గన్నవరం అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు : 

వైసిపి అభ్యర్థి :

సిట్టింగ్ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుకు మరోసారి పి.గన్నవరంలో పోటీచేసే అవకాశం వైసిపి ఇవ్వలేదు. అతడి స్థానంలో విప్పర్తి వేణుగోపాల్ ను వైసిపి అభ్యర్థిగా ప్రకటించారు.  

టిడిపి అభ్యర్థి :

పి. గన్నవరం బరిలో మహాసేన రాజేష్ ను దింపింది టిడిపి. దళిత వర్గాల కోసం పోరాటంచేస్తున్న సరిపెళ్లి రాజేష్ కుమార్ అలియాస్ మహాసేన రాజేష్ ఇటీవలే టిడిపిలో చేరి బాగా యాక్టివ్ గా పనిచేస్తున్నారు. దీంతో అతడికి పి. గన్నవరం సీటు కేటాయించింది టిడిపి అదిష్టానం. 

పి. గన్నవరం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు :

పి. గన్నవరం అసెంబ్లీ ఎన్నికలు 2019 ఫలితాలు : 

నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,56,212 (82 శాతం)

వైసిపి - కొండేటి చిట్టిబాబు - 67,373 (43 శాతం) - 22,207 ఓట్ల మెజారిటీతో విజయం

టిడిపి -నేలపూడి  స్టాలిన్ బాబు - 45,166 (28 శాతం) - ఓటమి 

పి. గన్నవరం అసెంబ్లీ ఎన్నికలు 2014 ఫలితాలు :

నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు -   1,42,815 (78 శాతం)

టిడిపి - పులపర్తి నారాయణ మూర్తి - 4,967 (52 శాతం) - 13,505 ఓట్ల మెజారిటీతో విజయం

వైసిపి - కొండేటి చిట్టిబాబు - 61,462 (43 శాతం) - ఓటమి

click me!