వైఎస్ జగన్ మీద కోట శ్రీనివాస రావు సంచలన వ్యాఖ్యలు

Published : Jul 11, 2020, 09:13 AM IST
వైఎస్ జగన్ మీద కోట శ్రీనివాస రావు సంచలన వ్యాఖ్యలు

సారాంశం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద టాలీవుడ్ నటుడు, మాజీ ఎమ్మెల్యే కోట శ్రీనివాస రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ గురించి మాట్లాడబోనని, ఏపీ గురించి ఒక్క మాటలో చెబుతానని ఆయన అంటూ జగన్ మీద వ్యాఖ్యలు చేశారు..

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద సినీ నటుడు, మాజీ ఎమ్మెల్యే కోట శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తన జన్మదినం సందర్భంగా ఓ న్యూస్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. తాను బిజెపి ఎమ్మెల్యేగా పనిచేసిన విషయాన్ని గుర్తు చేస్తూ ఆయన జగన్ పాలనపై వ్యాఖ్యలు చేశారు. 

తాను పాత సామెతలను నమ్ముతానని, ఆ సామెత ప్రకారం ఇప్పుడు ఆంధ్రలో పరిస్థితి చూస్తే నిద్రపోయేవాడిని లేపవచ్చు గానీ నిద్ర నటించేడిని లేపలేమని కోట శ్రీనివాస రావు అన్నారు అవన్నీ వైఎస్ జగన్ కు తెలియకుండానే జరగుతున్నాయా అని ఆయన ప్రశ్నించారు. మరి ఎందుకు అలా జరుగుతుందో తెలియడం లేదని ఆయన అన్నారు. అంతకు మించి మాట్లాడడానికి ఆయన ఇష్ట పడలేదు. అంతకు మించి తాను ఏమి చెప్పలేనని అన్నారు. 

తాను తెలంగాణ గురించి మాట్లాడబోనని, ఆంధ్రప్రదేశ్ గురించి మాత్రం మాట్లాడుతానని, తనకు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడే అర్హత ఉందని, అక్కడ తాను గతంలో ఎమ్మెల్యేగా పనిచేశానని ఆయన అన్నారు. తన స్వగ్రామం విజయవాడ పక్కనే ఉన్న కంకిపాడు అని, అక్కడ తనకు ఆస్తి కూడా ఉందని, అందుకే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడుతానని ఆయన అన్నారు. అది కూడా ఒకే ఒక మాటలో ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు సంభవిస్తున్న పరిస్థితిపై మాట్లాడుతానని అంటూ ఆయన పై వ్యాఖ్యలు చేశారు. 

తాను గతంలో బిజెపి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి పనిచేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తాను మాజీ ప్రధాని వాజ్ పేయికి అభిమానిని అని, అందుకే తనను బిజెపిలోకి తీసుకున్నారని, తాను విజయవాడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచానని ఆయన అన్నారు. 

PREV
click me!

Recommended Stories

Government Job : పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు.. కేవలం అప్లై చేస్తేచాలు జాబ్ .. తెలుగు యువతకు స్పెషల్ ఛాన్స్
Success Story : అన్న క్యాంటీన్ నుండి పోలీస్ జాబ్ వరకు .. ఈమెది కదా సక్సెస్ అంటే..!