
ఉదయ్ పూర్ లో (udaipur) హత్యకు గురైన కన్హయాలాల్ (tailor kanhaiya udaipur) కేసును బీజేపీ రాజకీయం చేస్తోందని ఆరోపించారు ఒడిషాలోని కోరాపుట్ కాంగ్రెస్ ఎంపీ (koraput congress mp) సప్తగిరి (Saptagiri Sankar Ulaka) . ఓ కార్యక్రమం నిమిత్తం శనివారం విశాఖ వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా వున్ మహ్మద్ రిజాయ్ అథారి .. బీజేపీ సభ్యుడని అన్నారు. రాజస్థాన్ విధాన్ సభ ప్రతిపక్షనేత గుబాబ్ చంధ్ కటారియా అల్లుడు అతనిని బీజేపీలోకి తెచ్చాడని సప్తగిరి ఆరోపించారు. ఇటీవల అరెస్ట్ అయిన లష్కరే తోయిబా తాలీ హుస్సేన్ తో అమిత్ షా ఫోటో దిగారంటూ ఆయన దుయ్యబట్టారు.
ALso Read:ఉదయ్‌పూర్ టైలర్ హంతకులకు హైద్రాబాద్‌తో లింకులు: పాతబస్తీలో ఎన్ఐఏ సోదాలు, నోటీసులు
అమరావతిలో హత్యకు గురైన కెమిస్ట్ కేసులోనూ నిందితుడైన వ్యక్తి బీజేపీకి (bjp) మద్ధతు తెలుపుతోన్న ఓ స్వతంత్ర ఎంపీ అనుచరుడని సప్తగిరి ఆరోపించారు. నిందితులు, టెర్రరిస్టులతో సంబంధాలు వున్న వాళ్లంతా బీజేపీతో అనుబంధం కలిగి వున్నారని ఆయన మండిపడ్డారు. బీజేపీ తన పార్టీలోకి కొత్తగా వస్తున్న బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేస్తుందా అని సప్తగిరి ప్రశ్నించారు. 2017 మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ పోలీసులు బీజేపీ నేతను అదుపులోకి తీసుకున్నారని ఆయన గుర్తుచేశారు. కాశ్మీర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ నేతలు టెర్రరిస్టులకు సాయం చేసిన వారికి టిక్కెట్లు ఇచ్చారని సప్తగిరి ఆరోపించారు.
బీజేపీ తమది జాతీయ పార్టీ అని చెప్పుకుంటుందని.. చైనా తయారు చేసిన త్రివర్ణ పతాకాన్ని దేశంపై మోపుతోందని ఆయన దుయ్యబట్టారు. బీజేపీ నేతలతో ఉగ్రవాదుల సంబంధాలు ఎందుకు బయటపడుతున్నాయని సప్తగిరి ప్రశ్నించారు. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మతోన్మాదాన్ని రెచ్చగొట్టే కుట్ర ఎవరు చేస్తున్నారు.. ప్రధాని మౌనాన్ని వీడాలని సప్తగిరి కోరారు.