ఆయేషా మీరా కేసు: కోనేరు మనవడిని విచారిస్తున్న సీబీఐ

By narsimha lodeFirst Published Jan 18, 2019, 4:27 PM IST
Highlights

ఆయేషా మీరా హత్య కేసులో  మాజీ మంత్రి  కోనేరు రంగారావు  మనవడు  కోనేరు సతీష్‌ను శుక్రవారం నాడు సీబీఐ అధికారులు విచారించారు.


అమరావతి: ఆయేషా మీరా హత్య కేసులో  మాజీ మంత్రి  కోనేరు రంగారావు  మనవడు  కోనేరు సతీష్‌ను శుక్రవారం నాడు సీబీఐ అధికారులు విచారించారు.

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో మంత్రిగా  ఉన్న కోనేరు రంగారావు మనవడు కోనేరు సతీష్‌పై  ఆ సమయంలో ఆరోపణలు వచ్చాయి. ఆ సమయంలో  కోనేరు రంగారావు కూడ ఈ ఆరోపణలు ఖండించారు. ఆ సమయంలో  టీడీపీ ప్రతిపక్షంలో ఉంది. తాము అధికారంలోకి వస్తే ఆయేషా మీరా హత్య కేసును రీ ఓపెన్ చేయిస్తామని చంద్రబాబునాయుడు ప్రకటించారు.

టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసు విచారణను రీ ఓపెన్ చేయించారు. ఈ కేసు విచారణను సీబీఐకు కోర్టు అప్పగించింది.సీబీఐ అధికారులు ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేశారు.గతంలో ఈ కేసులో జైలులో శిక్షను అనుభవించిన సత్యంబాబును కూడ శుక్రవారం నాడు  సీబీఐ అధికారులు విచారించారు.

సత్యంబాబు విచారణ తర్వాత  కోనేరు సతీష్ ను కూడ శుక్రవారం నాడు సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. ఆయేషా మీరా హత్య కేసులో కోనేరు సతీష్ పాత్ర  ఏమీ లేదని సీఐడీ  గతంలో తేల్చింది. 

సంబంధిత వార్తలు

ఆయేషా మీరా హత్య కేసు.. మిమిక్రీతో నన్ను హంతకుడిని చేశారు: సత్యంబాబు

ఆయేషా మీరా కేసులో దారుణమైన ట్విస్ట్

అయేషా మీరా హత్య కేసు: సత్యంబాబును విచారిస్తున్న సిబిఐ

click me!