కోనసీమలో టెన్షన్ టెన్షన్.. కొనసాగుతున్న 144 సెక్షన్.. ఇంటర్‌నెట్ సేవలు బంద్..

By Sumanth KanukulaFirst Published May 25, 2022, 9:46 AM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లా పేరు మార్పు అగ్గిరాజేసిన సంగతి తెలిసిందే. కోనసీమ జిల్లా పేరును డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా మార్చొద్దంటూ జిల్లా కేంద్రం అమలాపురంలో మంగళవారం చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. 

ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లా పేరు మార్పు అగ్గిరాజేసిన సంగతి తెలిసిందే. కోనసీమ జిల్లా పేరును డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా మార్చొద్దంటూ జిల్లా కేంద్రం అమలాపురంలో మంగళవారం చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. మంత్రి పినిపే విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ ఇళ్లకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఈ క్రమంలో ప్రస్తుతం కోనసీమలో పరిస్థితులు నివురు గప్పిన నిప్పులా ఉన్నాయి. అమలాపురం పట్టణంలోని ప్రధాన కూడళ్లలో అడుగడుగునా నిఘా ఏర్పాటు చేశారు. భారీగా పోలీసులను మోహరించారు. ఎక్కడికక్కడ పికెట్లను ఏర్పాట్లు చేశారు. 

నిన్నటి ఘటనల దృష్ట్యా కొనసీమకు ఇతర జిల్లాల నుంచి కూడా బలగాలను రప్పించారు. సున్నితమైన ప్రాంతాల్లో పరిస్థితులను పర్యవేక్షించే బాధ్యతలను సీనియర్ ఐపీఎస్‌లకు బాధ్యతలు అప్పగించారు. కోనసీమలో సెక్షన్ 144, సెక్షన్ 30 అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు. ర్యాలీలు, నిరసనలు, బహిరంగ సభలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఏలూరు డీఐజీ పాలరాజు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. మళ్లీ ఆందోళనలు జరిగే అవకాశం ఉండొచ్చనే అనుమానంతో.. అమలాపురం మొత్తం పోలీసుల నిఘా నీడలోకి వెళ్లింది. 

అమలాపురం డిపో నుంచి సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేశారు. దీంతో ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితం అయ్యాయి. అలాగే కాకినాడ, రాజమండ్రి నుంచి కోనసీమకు బస్సు సర్వీసులు రద్దు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి అమలాపురం వచ్చే బస్సులను కూడా నిలిపివేశారు. ఇక, ప్రజలు గుంపులు గుంపులుగా రోడ్ల మీదకు రావొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం కోనసీమ జిల్లా సాధనసమితి చలో రావులపాలెంకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. 

ఇంటర్‌నెట్ సేవలు బంద్..
ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అమలాపురంలో ఇంటర్‌నెట్ సేవలను నిలిపివేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అన్ని నెట్‌వర్క్‌లకు సంబంధించిన ఇంటర్‌నెట్‌ సేవలను నిలిపివేశారు. సామాజిక మాద్యమాల ద్వారా తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా ఉండేలా ఈ చర్యలు చేపట్టారు. నిన్న జరిగిన ఘటనలను దృష్టిలో ఉంచుకుని.. పరిస్థితులు చక్కబడేవరకు ఇంటర్‌నెట్ సేవలు నిలిపివేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

పరిస్థితి అదుపులో ఉంది.. డీఐజీ పాలరాజ్
నిన్నటి అల్లర్లకు కారణమైన వారిని కొందరిని గుర్తించామని డీఐజీ పాలరాజ్ చెప్పారు. అమలాపురం పూర్తిగా పోలీసుల ఆధీనంలోనే ఉందని చెప్పారు. పుకార్లను ఎవరూ నమ్మవద్దని కోరారు. హింసాత్మక సంఘటనకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తే కేసులు నమోదు చేస్తామని చెప్పారు. అమలాపురంలో ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని చెప్పారు. 

అసలేం జరిగింది.. 
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొనసీమ జిల్లా పేరును డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కొనసీమ జిల్లాగా మార్చుతూ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందుకు సంబంధించి ప్రజల నుంచి అభ్యతంరాలను స్వీకరించేందుకు నెల రోజుల సమయం కేటాయించింది. అన్ని రాజకీయ పార్టీల డిమాండ్‌ మేరకు కొత్త జిల్లా పేరు మార్చాలనే ప్రతిపాదనను తీసుకొచ్చామని మంత్రి విశ్వరూపు తెలిపారు. అయితే కొనసీమ జిల్లా పేరును మార్చడంపై కోనసీమ సాధన సమితి అభ్యంతరం వ్యక్తం చేసింది. కోనసీమ పేరునే కొనసాగించాలని కోరుతూ.. మంగళవారం నిరసననలకు పిలుపునిచ్చింది. 

అయితే ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. కొంతమంది ఆందోళనకారులు మంత్రి పి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఇళ్లకు నిప్పు పెట్టారు. అంతేకాకుండా కొన్ని వాహనాలకు కూడా నిప్పుపెట్టారు. పోలీసు సిబ్బందిపై రాళ్లు రువ్వారు. రాళ్ల దాడిలో కనీసం 20 మంది పోలీసులు గాయపడ్డారు. అమలాపురం డీఎస్పీ మాధవరెడ్డి గాయపడి అపస్మారక స్థితిలో పడిపోయారు. ఆందోళనకారులతో జరిగిన ఘర్షణలో కోనసీమ జిల్లా ఎస్పీ సుబ్బారెడ్డి తలకు గాయమైంది. మరోవైపు ఆందోళనకారులు కూడా పదుల సంఖ్యలో గాయపడ్డారు. 

ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లాలోని అమలాపురం పట్టణంలో దహనం జరిగింది మరియు కొత్తగా ఏర్పడిన కోనసీమ జిల్లా పేరును డాక్టర్ బిఆర్‌గా మార్చడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు మంగళవారం, మే 24, ఆంధ్ర మంత్రి పి విశ్వరూపు మరియు వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే పి.సతీష్ ఇళ్లకు నిప్పు పెట్టారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా. నిరసనలను అదుపు చేసేందుకు లాఠీచార్జి చేయడంతో పోలీసులతో సహా డజన్ల కొద్దీ ప్రజలు గాయపడ్డారు.

ఈ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అదనపు పోలీసు బలగాలను కొనసీమ జిల్లా రప్పించారు. అమలాపురంలో సెక్షన్ 144 CrPC కింద నిషేధాజ్ఞలు విధించారు. 
అమలాపురం చేరుకున్న ఏలూరు రేంజ్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జి పాలరాజు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. గాయపడిన పోలీసు సిబ్బందికి ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు. 

అమలాపురంలో హింసాత్మక ఘటనల వెనుక ఏవో శక్తులున్నాయని అధికార పక్షం ఆరోపిస్తుండగా.. పరిస్థితిని అదుపు చేయడంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందిందని ప్రతిపక్షాలన్నీ విరుచుకుపడ్డాయి. ప్రజలు సంయమనం పాటించి కోనసీమలో శాంతి నెలకొనాలని ప్రతిపక్షాలు విజ్ఞప్తి చేశాయి. 
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. మెజారిటీ ప్రజల మనోభావాలను గౌరవించేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నందున డాక్టర్‌ అంబేద్కర్‌ పేరును తొలగించే ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు.

click me!