
అరకులోయ : అసంపూర్తిగా నిలిపివేసిన Building construction తిరిగి ప్రారంభించామని అడిగినందుకు ఓ Secretariat employee వైసీపీ నేత నోటికొచ్చినట్లు మాట్లాడారు. దీనికి సంబంధించిన ఆడియో viral అవుతుంది. బీంపోల్ పంచాయితీలో రాజ్ కుమార్ సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఇదే పంచాయతీ లో సగం నిర్మించి వదిలేసిన సచివాలయం పనులు ప్రారంభించాలని గుత్తేదారు, వైసీపీ నేత, మాజీ సర్పంచ్ భర్త వీరమళ్ల ఈశ్వరరావు కు సెల్ ఫోన్ లో message పంపించారు. అసలు చేస్తారా?.. చేయరా?.. చెప్పాలన్నారు.. ఈ మెసేజ్ చూసిన ఆయన ఆగ్రహం తో ఊగిపోయారు.
ఇంజనీరింగ్ అసిస్టెంట్ కి ఫోన్ చేసి తిట్లదండకం మొదలు పెట్టారు. మనిషికి గౌరవము ఇవ్వు. చిన్న పిల్లాడివి పిల్లాడిలా ఉండు.. బోడి ఉద్యోగాలు చేసి ఎవరిని బెదిరిస్తారు మీరు.. పక్కన వేరే భవనాలు కడుతున్న వారిని అడిగావా?.. కుర్రోడివి రెచ్చిపోతున్నావు.. దెబ్బతింటే పుంజుకోలేవు అంటూ నోటికి వచ్చినట్లు మాట్లాడారు. ఆయనను వారించేందుకు ప్రయత్నించినా లెక్కచేయలేదు. ఈ విషయమై ఇంజనీరింగ్ అసిస్టెంట్ వద్ద ప్రస్తావించగా విధులలో భాగంగానే సందేశం పంపించాను అని అందుకు ఆయన అతిగా స్పందించినట్లు తెలిపారు.
ఈ విషయమై ఇప్పటికే తన ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చానని అన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి నిర్ణయం తీసుకుంటామన్నారు. అదేవిధంగా ఈశ్వరరావు వద్ద ప్రస్తావించగా తనకు అమర్యాదగా సందేశం పంపించినట్లు చెప్పాడు. అందుకోసమే ఫోన్ చేసి అడిగాను అని అన్నారు. దీనిని కావాలనే రాద్ధాంతం చేస్తున్నారు అన్నారు.
ఇలా ఉండగా, గత డిసెంబర్ లో East Godavari జిల్లా అయినవిల్లి మండలంలో మహిళ అ అధికారిణిని ycp leader దూషించారు. తాము చెప్పిందే చేయాలంటూ బెదిరించారు. ఈ ఘటనతో MPDO KR Vijaya కన్నీటిపర్యంతమయ్యారు. నియోజకవర్గంలోని వైకాపా నేతల మధ్య గ్రూప్ ల కారణంగా, తమ వర్గానికి ప్రాధాన్యం ఇవ్వడం లేదని భావించి.. నల్లచెరువు గ్రామానికి చెందిన మాజీ సర్పంచి
Vasansetty Tataji సోమవారం ఎంపీడీవో కార్యాలయానికి వచ్చారు.
‘మేము చెప్పిన మాట వినడం లేదు.. మా మాట వినకపోతే చీరేస్తాం..’ అంటూ ఎంపిడిఓ పై విరుచుకుపడ్డారు. అక్కడున్న కార్యాలయ సూపరింటెండెంట్ దీక్షితులు వారిస్తున్నా వినకుండా తీవ్రపదజాలంతో దూషించడంతో ఆమె విలపించారు.
నేను ఇక్కడ పని చేయడం మీకు ఇష్టం లేకపోతే ఎక్కడికైనా పంపించేయండి.. అంటూ ఆమె చెబుతున్నా తాతాజీ వినిపించుకోలేదు.. తనను వైకాపా నేత దూషించారని.. రక్షణ కల్పించాలని.. అమలాపురం ఆర్టీవో వసంతరాయుడుకి ఫిర్యాదు చేసినట్లు ఎంపీడీవో విజయ తెలిపారు.