మా టార్గెట్ కొడాలి నాని ఓటమి, మళ్లీ ఎంపీగానే పోటీ చేస్తా: టీడీపీ ఎంపీ కొనకళ్ల

Published : Feb 20, 2019, 04:38 PM ISTUpdated : Feb 20, 2019, 04:40 PM IST
మా టార్గెట్ కొడాలి నాని ఓటమి, మళ్లీ ఎంపీగానే పోటీ చేస్తా: టీడీపీ ఎంపీ కొనకళ్ల

సారాంశం

లోకేష్ కృష్ణాజిల్లాలో ఎక్కడ నుంచి పోటీ చేసినా మా మద్దతు ఉంటుందన్నారు. ఇకపోతే గుడివాడలో వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానిని ఓడించడమే మా లక్ష్యమన్నారు. కొడాలి నానిని ఓడించేందుకు ప్రత్యేక దృష్టి సారించినట్లు కొనకళ్ల నారాయణ స్పష్టం చేశారు. 

విజయవాడ: మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణ రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని ఒకవైపు ప్రచారం జరుగుతుంది. కాదు ఎంపీగానో మరోసారి పోటీ చేస్తారంటూ మరో ప్రచారం జరుగుతుంది. అంతేకాదు ఎమ్మెల్యే సీటు ఇవ్వకపోతే తెలుగుదేశం పార్టీ వీడుతారంటూ ప్రచారం కూడా జరుగుతోంది. 

సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నప్పటికీ ఎంపీ కొనకళ్ల నారాయణ ఏమాత్రం స్పందించలేదు. అయితే బుధవారం తనపై వస్తున్న ప్రచారాలపై స్పందించారు. ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని తాను ఎక్కడా చెప్పలేదన్నారు. మళ్లీ ఎంపీగానే పోటీ చేస్తానని చెప్పుకొచ్చారు. 

పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా తాను కట్టుబడి ఉంటానన్నారు. అభ్యర్థుల ఎంపికపై తెలుగుదేశం పార్టీలో కసరత్తు జరుగుతోందన్నారు. ఇకపోతే మంత్రి నారా లోకేష్ పోటీపై కూడా స్పందించారు. 

లోకేష్ కృష్ణాజిల్లాలో ఎక్కడ నుంచి పోటీ చేసినా మా మద్దతు ఉంటుందన్నారు. ఇకపోతే గుడివాడలో వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానిని ఓడించడమే మా లక్ష్యమన్నారు. కొడాలి నానిని ఓడించేందుకు ప్రత్యేక దృష్టి సారించినట్లు కొనకళ్ల నారాయణ స్పష్టం చేశారు. 

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు