టీడీపీ నేతలు కొమ్మారెడ్డి పట్టాభిరాం, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలు జగన్ ప్రభుత్వం మీద విరుచుకుపడ్డారు. వేర్వేరుగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ తో అనేక అంశాల మీద వారు జగన్ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు.
విజయవాడ : నిబంధనలను తుంగలో తొక్కుతూ దేశంలోనే అత్యధికంగా అప్పుచేసిన రాష్ట్రంగా ఇప్పటికే ఏపీకి కీర్తి ఉంది అని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం విరుచుకుపడ్డారు. సూట్ కేసు కంపెనీలు ఏర్పాటుచేయడంలో జనగ్ రెడ్డి, విజయసాయిరెడ్డిలకు మంచి పట్టు ఉందని ఎద్దేవా చేశారు. ఇప్పుడు బ్యాంకుల నుంచి నిధులు కొల్లగొట్టేందుకు జగన్ రెడ్డి సూట్ కేసు కంపెనీల ఏర్పాటుచేస్తున్నారన్నారు. ఏపీఎస్ డీసీ పేరుతో కంపెనీ ఏర్పాటుచేసి బ్యాంకుల నుంచి రూ.25 వేల కోట్ల రుణాలు కొల్లగొట్టాడన్నారు.
కార్పోరేషన్ల పేరుతో దొడ్డి దారిన డబ్బులు తీసుకువచ్చి, దారిమళ్లించి, అవినీతికి పాల్పడుతున్నారని మేం మొదటి నుంచి చెబుతూనే ఉన్నామని.. మేం ఆందోళనన చెందినట్లుగానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా కార్పోరేషన్ల అప్పుపై ఆందోళన వ్యక్తం చేసిందన్నారు. కార్పోరేషన్ల రుణాలపై బ్యాంకులకు ఆర్బీఐ కఠిన ఆదేశాలు జారీ చేయడం జగన్ రెడ్డి దోపిడీ విధానాలకు పర్యవసానమేనన్నారు. ఏపీలో ఆర్థిక ఉగ్రవాదాన్ని చూసిన తర్వాతే జూన్ 14, 2022న షెడ్యూల్డ్ బ్యాంకులకు ఆర్బీఐ సర్క్యులర్ జారీ చేయడం పరిస్థితికి అద్దం పడుతోందన్నారు.
undefined
రాష్ట్ర బడ్జెట్ అవసరాల కోసం కార్పోరేషన్ల రుణాలు, దారిమళ్లించడానికి వీల్లేదని ఆర్బీఐ గతంలో చాలా స్పష్టంగా చెప్పింది. తాజాగా జారీచేసిన సర్క్యులర్ లో కూడా ఆర్బీఐ ఈ అంశాన్ని ప్రస్తావించింది. కార్పోరేషన్లకు అప్పులపై రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన గ్యారింటీని క్రైటీరియాగా తీసుకుని అప్పులు ఇవ్వడానికి వీల్లేదని బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది.
ఆర్బీఐ ఆదేశాలు అమలవుతున్నాయా, లేదా అని బ్యాంకులు 3 నెలల్లో నివేదిక ఇవ్వాల్సి ఉంది. రాష్ట్ర బడ్జెట్ అవసరాల కోసమే ఏపీఎస్ డీసీ ఏర్పాటుచేస్తున్నట్లు జీవో 80లో జగన్ రెడ్డి పేర్కొన్నారని.. జగన్ రెడ్డి జారీ చేసిన జీవో ఆర్బీఐ మార్గదర్శకాల ఉల్లంఘనేనని పట్టాభిరాం మండిపడ్డారు.
రూ.25వేల కోట్లకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ కోసం ఇచ్చిన జీవో నెం.92 కూడా ఆర్బీఐ మార్గదర్శకాల ఉల్లంఘనేనని..మోసకారి సంక్షేమం పేరుతో సూట్ కేసు కంపెనీల ఏర్పాటు చేసి వేలకోట్ల నిధులు కొల్లగొడుతున్నారని.. అంతేకాదు జగన్ రెడ్డి ఇచ్చిన జీవోలన్నీ ఆర్బీఐ మార్గదర్శకాల ఉల్లంఘనేనని అన్నారు.
శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత.. మూడు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసిన మంత్రి అంబటి
ఇక టీడీపీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మరోచోట మాట్లాడుతూ.. జగన్ రెడ్డి పాలనలో పంటలపై పెట్టుబడి, ఎరువుల ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. ఎకరా వరిసేద్యానికి 3 సంవత్సరాల్లో 12 నుంచి 15 వేలుకు పెట్టుబడి పెరిగింది. టీడీపీ హయాంలో తుఫాను సమయంలో హెక్టారు పత్తికి 15, వరికి 25, అరటికి 30, చెరుకుకు 15వేలు అందించి ఆదుకున్నాం. కుటుంబాల్లో గాయపడినవారికి లక్ష రూపాయలు ఇచ్చి సహాయపడ్డాం.
ప్రకృతి విపత్తులలో సాయం చేయాల్సిన ప్రభుత్వం అరకొరగా చేసి చేతులెత్తేయడం దారుణం. ప్రస్తుత ప్రభుత్వం ఆక్వా, వ్యవసాయ రంగాన్ని మూసేసింది. కన్నబాబు సగం వ్యవసాయ శాఖను మూసేస్తే.. కాకాని పూర్తిగా మూసేశారు. ఏపీ మూడు సంవత్సరాల్లో మైక్రో ఇరిగేషన్ మూత వేసిందని బీబీసీ చెప్పింది.. దీనికి సమాధానమేది?
టీడీపీ హయాంలో హుద్ హుద్, తిత్లి తుఫాను సమయాల్లో చంద్రబాబు దగ్గరుండి పరిస్థితిని చక్కదిద్దారు. మూడు రాజధానుల విషయం అడిగితే ఆఫ్రికాతో పోలుస్తారు, మేం శ్రీలంకతో పోలిస్తే బుకాయిస్తారని మండిపడ్డారు.