ఆ మండలంలోని 25 పంచాయతీలకు ఎన్నికలు.. కొల్లు రవీంద్ర డిమాండ్..

By AN TeluguFirst Published Jan 23, 2021, 2:54 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో బందరు మండలంలోని 25 పంచాయతీలకు ఎన్నికలు జరపాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనం చేసేందుకు గెజిట్ విడుదల చేసిన 9 పంచాయతీలను కార్పొరేషన్‌లో విలీనం చేయాలని అన్నారు. 

మిగిలిన 25 పంచాయతీలకు రిజర్వేషన్లు ప్రకటించి ఎన్నికలు జరపాలని ఆయన సూచించారు. ఇదే విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు. కార్పొరేషన్‌లో తమకు అనుకూలంగా డివిజన్ పరిధులను అధికార వైసీపీ నిర్ణయించిందన్నారు. 

ఓటర్ల జాబితాలోనూ తీవ్ర వ్యత్యాసాలు ఉన్నాయని తెలిపారు. వీటిని కూడా సరి చేయాలని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లామన్నారు. కాగా ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి నోటిఫికేషన్‌ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ తీరుపై సర్వత్రా ఆగ్రహం వెల్లువెత్తుతోంది. ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల అభ్యర్థనలను ఏ మాత్రం పట్టించుకోకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

click me!