జగన్ కేబినెట్ లో కోలగట్ల వీరభద్రస్వామి

By Nagaraju penumalaFirst Published Jun 7, 2019, 6:31 PM IST
Highlights

ప్రస్తుతం ఉత్తరాంధ్ర  ఇంచార్జ్ గా వ్యవహరిస్తున్నారు కోలగట్ల వీరభద్రస్వామి వ్యవహరిస్తున్నారు. అలాగే ఎమ్మెల్సీగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయనగరం అభ్యర్థిగా పోటీ చేసి కేంద్రమాజీమంత్రి అశోక్ గజపతిరాజు తనయ అధితి గజపతిని ఓడించారు. 
 
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి బెర్త్  కన్ఫమ్ చేసుకున్నారు. జగన్ కేబినెట్ లో వివిధ సామాజిక వర్గాల వారీగా మంత్రి పదవులను కేటాయించారు వైయస్ జగన్. 

వైశ్య సామాజిక వర్గానికి ఒక మంత్రి పదవి కేటాయించిన నేపథ్యంలో మంత్రి పదవి కోలగట్ల వీరభద్రస్వామిని వరించింది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించినప్పటికీ కోలగట్ల వీరభద్రస్వామి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. 

ప్రస్తుతం ఉత్తరాంధ్ర  ఇంచార్జ్ గా వ్యవహరిస్తున్నారు కోలగట్ల వీరభద్రస్వామి వ్యవహరిస్తున్నారు. అలాగే ఎమ్మెల్సీగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయనగరం అభ్యర్థిగా పోటీ చేసి కేంద్రమాజీమంత్రి అశోక్ గజపతిరాజు తనయ అధితి గజపతిని ఓడించారు. 

విజయనగరం జిల్లాలో పూసపాటి వంశీయులను ఓడించిన ఏకైక నాయకుడుగా రికార్డు సృష్టించారు కోలగట్ల వీరభద్రస్వామి. వైయస్ జగన్ కు అత్యంత సన్నిహితుడిగా ఉంటూ వైసీపీలో కీలకంగా వ్యవహరించారు కోలగట్ల. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయనను మంత్రి పదవి వరించింది. శనివారం మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు.   

click me!