కోడూరు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

By Arun Kumar P  |  First Published Jun 4, 2024, 7:12 AM IST

1962లో ఏర్పడిన కోడూరులో కాంగ్రెస్ 4 సార్లు, టీడీపీ ఐదు సార్లు, వైసీపీ మూడు సార్లు , ఇతరులు మూడు సార్లు విజయం సాధించారు.  ఈసారి జనసేన, బీజేపీలతో పొత్తులో టిడిపి పోటీ చేసి ఘన విజయం సాధించింది. 


అన్నమయ్య జిల్లా కోడూరు రాజకీయాలు ఎప్పుడూ ప్రత్యేకంగా వుంటాయి. శేషాచలం కొండలను ఆనుకుని వుండే ఈ నియోజకవర్గంలో ప్రత్యేక పరిస్ధితులు నెలకొన్నాయి. 1962లో ఏర్పడిన కోడూరులో. కాంగ్రెస్ 4 సార్లు, టీడీపీ ఐదు సార్లు, వైసీపీ మూడు సార్లు , ఇతరులు మూడు సార్లు విజయం సాధించారు. ఈసారి టిడిపి కూటమి గాలి గట్టిగా వీయడంతో జనసేన అభ్యర్థి అరవ శ్రీధర్ 11,101 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. వైసిపి అభ్యర్థి కొరుముట్ల శ్రీనివాసులు పరాజయం తప్పలేదు. 

ఎస్సీ నియోజకవర్గమైన కోడూరులో 2,01,660 మంది ఓటర్లున్నారు. వీరిలో పురుషులు 99,463 మంది పురుషులు కాగా.. 1,02,180 మంది మహిళలు. ఈ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో పెనగలూరు, చిట్వేల్, పుల్లంపేట, ఓబుళవారిపల్లె, రైల్వే కోడూరు మండలాలున్నాయి. ఈ నియోజకవర్గం 1999 వరకు టీడీపీకి కంచుకోటగా వుండేది. అలాంటి పార్టీ ఇక్కడ గెలిచి దాదాపు 25 ఏళ్లు గడుస్తోంది. వరుసగా ఐదు సార్లు కోడూరు ప్రజలు తెలుగుదేశం పార్టీని తిరస్కరిస్తూ వచ్చారు. కానీ ఈసారి పొత్తులో భాగంగా ఆ సీటును పొందిన జనసేప విజయం సాధించింది. 

Latest Videos

undefined

 టీడీపీ పరిస్థితి :

కోడూరులో గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన సరస్వతి టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేశారు. గుంటి శ్రీరాములు, తూమాటి పెంచలయ్యలు రెండేసి సార్లు ఎమ్మెల్యేలుగా పనిచేశారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసిన కోరుముట్ల శ్రీనివాసులు అనంతర కాలంలో జగన్ వెంట నడిచారు. ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతో 2012లో కోడూరులో ఉపఎన్నిక వచ్చింది. ఈ ఎన్నికలో గెలిచిన శ్రీనివాసులు.. 2014, 2019లలో వైసీపీ అభ్యర్ధిగా విజయం సాధించారు. 

టిడిపి చేయలేనిది జనసేన చేసి చూపించింది..:

 ఉమ్మడి కడప జిల్లాలోనే తెలుగుదేశం పార్టీకి మంచి పట్టున్న ప్రాంతంగా వర్ధిల్లింది. 1983 నుంచి 1999 వరకు సైకిల్ జోరుగా దూసుకెళ్లింది. కానీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కోడూరులో ప్రత్యేకంగా దృష్టి పెట్టడంతో 2004లో టీడీపీ ఓటమి పాలై నాటి నుంచి కోలుకోలేకపోయింది. కానీ మళ్ళీ ఇప్పుడు జనసేన విజయంతో ఆ పార్టీకి పూర్వవైభవం వచ్చింది. 

click me!