కోడూరు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

By Siva KodatiFirst Published Mar 18, 2024, 9:55 PM IST
Highlights

1962లో ఏర్పడిన కోడూరులో ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ 4 సార్లు, టీడీపీ ఐదు సార్లు, వైసీపీ మూడు సార్లు , ఇతరులు మూడు సార్లు విజయం సాధించారు. ఎస్సీ నియోజకవర్గమైన కోడూరులో 2,01,660 మంది ఓటర్లున్నారు. 1999 వరకు టీడీపీకి కంచుకోటగా వుండేది. అలాంటి పార్టీ ఇక్కడ గెలిచి దాదాపు 25 ఏళ్లు గడుస్తోంది. వరుసగా ఐదు సార్లు కోడూరు ప్రజలు తెలుగుదేశం పార్టీని తిరస్కరిస్తూనే వస్తున్నారు. 1983 నుంచి 1999 వరకు సైకిల్ జోరుగా దూసుకెళ్లింది. కానీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కోడూరులో ప్రత్యేకంగా దృష్టి పెట్టడంతో 2004లో టీడీపీ ఓటమి పాలై నాటి నుంచి కోలుకోలేకపోయింది. ఈసారి జనసేన, బీజేపీలతో పొత్తులతో వుండటంతో ఆ పార్టీల ఓట్లు టీడీపీకి పడతాయని చంద్రబాబు భావిస్తున్నారు. 

అన్నమయ్య జిల్లా కోడూరు రాజకీయాలు ఎప్పుడూ ప్రత్యేకంగా వుంటాయి. శేషాచలం కొండలను ఆనుకుని వుండే ఈ నియోజకవర్గంలో ప్రత్యేక పరిస్ధితులు నెలకొన్నాయి. 1962లో ఏర్పడిన కోడూరులో ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ 4 సార్లు, టీడీపీ ఐదు సార్లు, వైసీపీ మూడు సార్లు , ఇతరులు మూడు సార్లు విజయం సాధించారు. ఎస్సీ నియోజకవర్గమైన కోడూరులో 2,01,660 మంది ఓటర్లున్నారు.

వీరిలో పురుషులు 99,463 మంది పురుషులు కాగా.. 1,02,180 మంది మహిళలు. ఈ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో పెనగలూరు, చిట్వేల్, పుల్లంపేట, ఓబుళవారిపల్లె, రైల్వే కోడూరు మండలాలున్నాయి. ఈ నియోజకవర్గం 1999 వరకు టీడీపీకి కంచుకోటగా వుండేది. అలాంటి పార్టీ ఇక్కడ గెలిచి దాదాపు 25 ఏళ్లు గడుస్తోంది. వరుసగా ఐదు సార్లు కోడూరు ప్రజలు తెలుగుదేశం పార్టీని తిరస్కరిస్తూనే వస్తున్నారు. 

కోడూరు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 .. టీడీపీకి వరుస పరాభవాలు :

కోడూరులో గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన సరస్వతి టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేశారు. గుంటి శ్రీరాములు, తూమాటి పెంచలయ్యలు రెండేసి సార్లు ఎమ్మెల్యేలుగా పనిచేశారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసిన కోరుముట్ల శ్రీనివాసులు అనంతర కాలంలో జగన్ వెంట నడిచారు. ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతో 2012లో కోడూరులో ఉపఎన్నిక వచ్చింది. ఈ ఎన్నికలో గెలిచిన శ్రీనివాసులు.. 2014, 2019లలో వైసీపీ అభ్యర్ధిగా విజయం సాధించారు. 

కోడూరు శాసనసభ ఎన్నికల ఫలితాలు 2024 .. టీడీపీ జైత్రయాత్రకు బ్రేక్ వేసిన వైఎస్ :

2024 ఎన్నికల విషయానికి వస్తే రైల్వే కోడూరులో విజయాలను కంటిన్యూ చేయాలని జగన్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కోరుముట్ల శ్రీనివాసులకే మరోసారి టికెట్ ఖరారు చేశారు. జగన్ ఛరిష్మా, తనకున్న క్లీన్ ఇమేజ్ కారణంగా మరోసారి విజయం సాధిస్తానని శ్రీనివాసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ విషయానికి వస్తే.. ఒకప్పుడు కోడూరు ఆ పార్టీకి కంచుకోటగా నిలిచింది.

ఉమ్మడి కడప జిల్లాలోనే తెలుగుదేశం పార్టీకి మంచి పట్టున్న ప్రాంతంగా వర్ధిల్లింది. 1983 నుంచి 1999 వరకు సైకిల్ జోరుగా దూసుకెళ్లింది. కానీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కోడూరులో ప్రత్యేకంగా దృష్టి పెట్టడంతో 2004లో టీడీపీ ఓటమి పాలై నాటి నుంచి కోలుకోలేకపోయింది. చంద్రబాబు నాయుడు ఎంతగా వ్యూహాలు రచిస్తున్నా కోడూరులో మాత్రం గెలుపు సాధ్యం కావడం లేదు. ఈసారి జనసేన, బీజేపీలతో పొత్తులతో వుండటంతో ఆ పార్టీల ఓట్లు టీడీపీకి పడతాయని చంద్రబాబు భావిస్తున్నారు. 

click me!