అందరికి ఆదర్శం: కరోనా నుంచి కోలుకొని ప్లాస్మా డొనేట్ చేసిన వైసీపీ ఎమ్మెల్యే

By Sreeharsha Gopagani  |  First Published Jul 29, 2020, 12:09 PM IST

అందరికి ఆదర్శంగా నిలుస్తూ వైసీపీ కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ కరోనా నుంచి కోలుకున్న తరువాత వచ్చి కర్నూల్ గవర్నమెంట్ ఆసుపత్రిలో సురక్షితమైన వాతావరణంలో తన ప్లాస్మాను డొనేట్ చేసారు. 


కరోనా మహమ్మారి విలయతాండవానికి ప్రపంచం వణికిపోతుంది. అన్ని దేశాలు కూడా ఈ వైరస్ ని ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక వాక్సిన్ త్వరగా వస్తే బాగుండు అని అనుకుంటున్నాయి. కరోనా కి ఇంకా సరైన మందు లేకపోవడంతో..... పరిస్థితి విషమించిన వారికి ప్లాస్మా చికిత్సనందించడం ద్వారా వారి ప్రాణాలను కాపాడుతున్నారు. 

కరోనా వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నవారి ప్లాస్మాలో కరోనా వైరస్ ని ఎదుర్కునే యాంటీ బాడీస్ ఉంటాయి కాబట్టి దాన్ని కరోనా రోగికి ఎక్కిస్తారు. ఇలా వారి ప్రాణాలను కాపాడుతున్నారు. 

Latest Videos

undefined

కానీ చాలా మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నవారు ప్లాస్మా డొనేషన్ కి ముందుకు రావడంలేదు. ప్రభుత్వం, స్వచ్చంధ సంస్థలు పదే పదే విజ్ఞప్తులను చేసినప్పటికీ... ఎవరు కూడా ముందుకు రావడంలేదు. 

అందరికి ఆదర్శంగా నిలుస్తూ వైసీపీ కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ కరోనా నుంచి కోలుకున్న తరువాత వచ్చి కర్నూల్ గవర్నమెంట్ ఆసుపత్రిలో సురక్షితమైన వాతావరణంలో తన ప్లాస్మాను డొనేట్ చేసారు. 

నెల రోజుల కింద సుధాకర్ కరోనా వైరస్ బారినపడి కుర్మాన్నోల్ జిజిహెచ్ లో అడ్మిట్ అయి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఆయన డిశ్చార్జ్ అయి నెల రోజులవుతుంది. ఈ నేపథ్యంలోనే ఆయన వచ్చి ప్లాస్మాను డొనేట్ చేసారు. ఏపీలో ప్లాస్మా డొనేట్ చేసిన తొలి ఎమ్మెల్యేగా నిలిచారు సుధాకర్. 

click me!