వైఎస్ జగన్‌పై కోడి కత్తితో దాడి కేసు.. సీజేఐకు లేఖ రాసిన నిందితుడు శ్రీను

Published : Jun 15, 2023, 03:29 PM IST
వైఎస్ జగన్‌పై కోడి కత్తితో దాడి కేసు.. సీజేఐకు లేఖ రాసిన నిందితుడు శ్రీను

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో విశాఖపట్నం ఎయిర్‌పోర్టు కోడికత్తితో దాడి జరగడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కోడి కత్తి శ్రీను (జన్నుపల్లి శ్రీనివాస్) నిందితుడిగా ఉన్నాడు. 

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో విశాఖపట్నం ఎయిర్‌పోర్టు కోడికత్తితో దాడి జరగడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కోడి కత్తి శ్రీను (జన్నుపల్లి శ్రీనివాస్) నిందితుడిగా ఉన్నాడు.  ప్రస్తుతం ఈ కేసు విచారణ ఎన్‌ఐఏ కోర్టులో కొనసాగుతుంది. అయితే తాజాగా ఈ కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. నిందితుడు జన్నుపల్లి శ్రీనివాస్.. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌కు లేఖ రాశాడు. తనకు జైలు నుంచి విముక్తి కలిగించాలని లేఖలో కోరాడు. 

1610 రోజులుగా బెయిల్ లేకుండా జైలులోనే ఉంటున్నాని.. తాను ఇంకా ఎంత కాలం జైలులో ఉండాలో తెలియడం లేదని.. తన విముక్తి కలిగించాలని శ్రీను లేఖలో కోరారు. తనకు న్యాయం చేయాలని అనేక మార్లు కోర్టకు విన్నవించాననని.. అయినా స్పందన లేకపోవడంతో ఈ లేఖ రాస్తున్నానని తెలిపారు. ఇక, శ్రీను తెలుగులో లేఖ రాశారని.. దానిని ఇంగ్లీష్‌లో అనువాదం  చేసి సీజేఐకు పంపుతామని ఆయన తరఫు లాయర్ చెప్పారు. 

ఇదే విషయంపై గతంలో సీజేఐగా ఉన్న ఎన్వీ రమణ‌కు శ్రీను తల్లి కూడా సావిత్ర కూడా లేఖ రాశారు. నాలుగేళ్లుగా తన కుమారుడిని రిమాండ్ ఖైదీగానే కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడు శ్రీనివాస్‌ను తక్షణమే విడుదల చేయాలని ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు.

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్