ఏపీలోని మారుమూల ప్రాంతాలకు 4జీ సేవలు.. ఒకేసారి 100 జియో టవర్లు ప్రారంభించిన జగన్

Siva Kodati |  
Published : Jun 15, 2023, 02:39 PM IST
ఏపీలోని మారుమూల ప్రాంతాలకు 4జీ సేవలు.. ఒకేసారి 100 జియో టవర్లు ప్రారంభించిన జగన్

సారాంశం

ఒకేసారి 100 జియో టవర్లను ప్రారంభించారు సీఎం వైఎస్ జగన్.  ఈ జియో టవర్ల ద్వారా రాష్ట్రంలోని 209 మారుమూల గ్రామాలకు 4జీ సేవలు అందించనున్నాయి. ఈ ప్రాజెక్ట్ కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2,704 ప్రాంతాల్లో టవర్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 

భారతదేశం 5జీ దిశగా అడుగులు వేస్తున్న వేళ.. ఇంకా దేశంలో సరైన నెట్‌వర్క్ లేని ప్రాంతాలు ఎన్నో వున్నాయి. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒకేసారి 100 జియో టవర్లను ప్రారంభించారు సీఎం వైఎస్ జగన్. గురువారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్‌గా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ జియో టవర్ల ద్వారా రాష్ట్రంలోని 209 మారుమూల గ్రామాలకు 4జీ సేవలు అందించనున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 85, మన్యం జిల్లాలో 10 , అన్నమయ్య జిల్లాలో 3, కడప జిల్లాలో 2 టవర్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి ఈ టవర్ల ద్వారా 4జీ సేవలు అందిస్తుండగా.. భవిష్యత్తులో 5జీ సేవలను అప్‌గ్రేడ్ చేయాలని రిలయన్స్ నిర్ణయించింది. ఈ మేరకు ఆ సంస్థతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. 

సెల్ టవర్స్ ప్రారంభోత్సవం ముగిసిన తర్వాత ఆయా ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, ప్రజలు సీఎం ముఖాముఖి నిర్వమించారు. ఈ ప్రాజెక్ట్ కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2,704 ప్రాంతాల్లో టవర్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా.. దీని కింద 2,363 చోట్ల స్థలాలను జియోకు అప్పగించింది. డిసెంబర్ నాటికి అన్ని ప్రాంతాల్లో టవర్లు ఏర్పాటు చేయాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్