చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా కావాలనే ఎమ్మెల్యేల గేటు నుంచి శాసనసభకు వచ్చారని మంత్రి కొడాలి నాని విమర్శించారు. ఇప్పుడు టీడీపీ నేతలు సభలోపలికొచ్చి డ్రామాలాడుతున్నారన్నారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఐదో రోజు ప్రారంభమయ్యాయి. కాగా.... ఈ సమావేశాల్లో టీడీపీ, వైసీపీ ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు పై మంత్రి కొడాలి నాని పలు ఆరోపణలు చేశారు.
AlsoReadవాస్తవాలు భయటపడతాయని ప్రభుత్వ భయం... సోమిరెడ్డి...
చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా కావాలనే ఎమ్మెల్యేల గేటు నుంచి శాసనసభకు వచ్చారని మంత్రి కొడాలి నాని విమర్శించారు. ఇప్పుడు టీడీపీ నేతలు సభలోపలికొచ్చి డ్రామాలాడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టించారని.. రాష్ట్ర ప్రజలు జగన్‌కు మద్దతు తెలిపి సీఎంని చేశారని కొడాలి నాని అన్నారు.
నిన్న అసెంబ్లీ సమావేశాలకు వస్తుండగా.... గేటు వద్ద చంద్రబాబుని అడ్డుకున్నారంటూ... టీడీపీ నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు కావాలనే ఆ గేటు నుంచి వచ్చారని... టీడీపీ నేతలే మార్షల్స్ పై దాడి చేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయంపై సభలో వాడి వేడి చర్చ జరుగుతోంది.