
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సింప్లిసిటీకి ఇది మరో ఉదాహరణ. ఓ అభిమాని ఇంటి ముందు పవన్... నిరాడంభరంగా నిద్రించారు. కాకినాడలో 2019, డిసెంబర్ 12వ తేదీ గురువారం రైతు సౌభాగ్య దీక్ష చేశారు. ఉదయం 8గంటలకు ప్రారంభమైన ఈ దీక్ష సాయంత్రం 6గంటలకు ముగిసింది.
దీక్ష ముగిసిన అనంతరం పవన్ కల్యాణ్ గారు మధురపూడి విమానాశ్రయానికి బయలుదేరారు. విమానాశ్రయానికి చేరుకొనేటప్పుడు- విమానం ఆలస్యం అని సమాచారం అందింది. దాంతో మార్గమధ్యమంలో ఓ జన సైనికుడు ఇంటి దగ్గర కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నారు. నేల మీద ఆయన పడుకోవడం గమనార్హం. కాగా... దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. పవన్ నిజంగానే జనం కోసం పుట్టిన నేత అంటూ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
AlsoReadషోకాజ్ నోటీస్: పవన్ కల్యాణ్ మీద ఎమ్మెల్యే రాపాక తిరుగుబాటు...
కాగా.. పవన్ చేపట్టిన రైతు సౌభాగ్య దీక్ష విజయవంతమైంది. ఈ దీక్షలో ఆయన మద్దతుదారులు, జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలతోపాటు... ఆయన సోదరుడు నాగబాబు కూడా పాల్గొన్నారు. అయితే... జనసేన పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించిన ఏకైక ఎమ్మెల్యే రాపాక మాత్రం ఈ సభకు గైర్హాజరు కావడం తీవ్ర చర్చనీయాంశమైంది.
ఇదిలా ఉంటే... ఓ వైపు పవన్ దీక్ష చేస్తుంటే... మరో వైపు ఆయన సోదరుడు చిరంజీవి.. సీఎం జగన్ ని కలిశారు. జగన్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పవన్ దీక్ష చేస్తంటే.. చిరంజీవి మాత్రం ముఖ్యమంత్రిపై ప్రశంసలు కురిపించారు. ఈ విషయంపై ఇప్పుడు రాజకీయంగా చర్చలు జరుగుతున్నాయి.