వాస్తవాలు భయటపడతాయని ప్రభుత్వ భయం... సోమిరెడ్డి

ramya Sridhar   | Asianet News
Published : Dec 13, 2019, 08:48 AM IST
వాస్తవాలు భయటపడతాయని ప్రభుత్వ భయం... సోమిరెడ్డి

సారాంశం

వాస్తవాలు బయటకు వస్తాయనే ప్రభుత్వం భయపడుతోందని, అందుకే అనుమతి ఇవ్వనట్టు కనిపిస్తోందన్నారు. నిషేధం విధించినంత మాత్రాన నిజాలను బయటకు రాకుండా ప్రభుత్వం ఆపలేదని అన్నారు. ప్రభుత్వ చర్యలు ప్రజాస్వామ్యాన్ని ప్రత్యక్షంగా ఖూనీ చేయడమేనన్నారు

వైసీపీ ప్రభుత్వం భయపడిపోతుందని టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.  ట్విట్టర్ వేదికగా సోమిరెడ్డి... వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఏ ప్రభుత్వానికైనా, పార్టీకైనా విమర్శలను ఎదుర్కొనే దమ్ముండాలన్నారు. ఏబీఎన్, టీవీ5 ప్రసారాలను మళ్లీ నిలిపివేయడం, వాటితో పాటు ఈటీవీకి అసెంబ్లీ లైవ్ అనుమతి నిరాకరించడం ప్రత్యక్ష కక్ష సాధింపేనన్నారు. 

వాస్తవాలు బయటకు వస్తాయనే ప్రభుత్వం భయపడుతోందని, అందుకే అనుమతి ఇవ్వనట్టు కనిపిస్తోందన్నారు. నిషేధం విధించినంత మాత్రాన నిజాలను బయటకు రాకుండా ప్రభుత్వం ఆపలేదని అన్నారు. ప్రభుత్వ చర్యలు ప్రజాస్వామ్యాన్ని ప్రత్యక్షంగా ఖూనీ చేయడమేనన్నారు. గత ఐదేళ్లలో సాక్షి బరితెగించి రాతలు రాసిందని, ఇప్పుడు సాక్షి రాసేది తప్పులని సీఎం జగన్ సెలవిస్తున్నారని సోమిరెడ్డి ఎద్దేవా చేశారు.

కాగా.... అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ప్రత్యక్ష ప్రసారాలను ఈటీవీ, ఏబీఎన్, టీవీ5 ఛానెల్స్  ప్రసారం చేయకుండా ప్రభుత్వం బ్యాన్ చేసింది. ఈ నేపథ్యంలో... నిషేధం ఎత్తివేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కాగా... గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలానే చేశారుగా అంటూ వైసీపీ నేతలు తిరిగి ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం బయపడి ఇలా చేస్తోందని  సోమిరెడ్డి విమర్శిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం