ఏపీ టిడిపి అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు... తెలంగాణ ఉపాధ్యక్షురాలిగా సుహాసిని

By Arun Kumar PFirst Published Oct 19, 2020, 12:55 PM IST
Highlights

 ఇరు తెలుగు రాష్ట్రాల్లోని తెలుగుదేశం పార్టీకి నూతన అధ్యక్షులు నియమితులయ్యారు.  

గుంటూరు: ఇరు తెలుగు రాష్ట్రాల్లోని తెలుగుదేశం పార్టీకి నూతన అధ్యక్షులు నియమితులయ్యారు. ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షుడిగా మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు నియమితులయ్యారు. అలాగే తెలంగాణ టిడిపి అధ్యక్షుడిగా రమణకే మరోసారి అవకాశం లభించింది. ఇలా ఇరు రాష్ట్రాల అధ్యక్షులతో పాటు వివిధ కమిటీలను కూడా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ప్రకటించారు. 

ఇక 27మందితో టిడిపి సెంట్రల్ కమిటీ , 25 మందితో పొలిట్ బ్యూరో ఏర్పాటయ్యింది. జాతీయ ప్రధాన కార్యదర్శిగా తిరిగి లోకేష్ నియమితులయ్యారు. ఆయనతో పాటు వర్ల రామయ్య, రామ్మోహన్ నాయుడు. బీద రవిచంద్ర, కొత్తకోట దయాకర్ రెడ్డి, నర్సింహులు, కంభంపాటి రామ్మోహన్ లను నియమించారు. ఇక జాతీయ ఉపాధ్యక్షులుగా ప్రతిభా పాటిల్, కాశీనాథ్, గల్లా అరుణ, సత్యప్రభ, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, మెచ్చ నాగేశ్వరరావును  నియమించారు. 

ఇక పొలిట్ బ్యూరోలో మాజీ కేంద్ర మంత్రి అశోక గజపతి రాజు, మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, కేఈ కృష్ణమూర్తి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి,  కాలవ శ్రీనివాసులు, కళా వెంకట్రావు, నక్కా ఆనంద్ బాబు,  బోండా ఉమ, పితాని సత్యనారాయణ, కొల్లు రవీంద్రలతో పాటు నందమూరి బాలకృష్ణ, వర్ల రామయ్య, బుచ్చయ్య చౌదరి, ఫారూఖ్, గల్లా జయదేవ్, రెడ్డప్పగారి శ్రీనివాస్ రెడ్డి, వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి, రావుల చంద్రశేఖర్ రెడ్డి, అరవింద్ కుమార్ గౌడ్ లకు చోటు దక్కింది. 
 

click me!