స్కిల్ డెవలప్‌మెంట్ కేసు.. సీఐడీ విచారణకు హాజరైన లోకేష్ సన్నిహితుడు కిలారు రాజేష్..

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో సీఐడీ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. తాజాగా ఈ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సన్నిహితుడు కిలారు రాజేష్ సీఐడీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు.

kilaru rajesh attends before cid officials in skill development scam case ksm

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో సీఐడీ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. తాజాగా ఈ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సన్నిహితుడు కిలారు రాజేష్.. తాడేపల్లిలోని సిట్ కార్యాలయంలో సీఐడీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. దీంతో సీఐడీ అధికారులు అతడిని ప్రశ్నిస్తున్నారు.  స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌ కేసులో కిలారు రాజేష్ అభియోగాలు ఎదుర్కొంటున్నారు. నారా లోకేష్‌కు కిలారు రాజేష్ ద్వారానే నగదు చేరిందని సీఐడీ అధికారులు ఆరోపిస్తున్నాయి. 

అయితే ఇప్పటివరకు ఈ కేసులో కిలారు రాజేష్‌ను సీఐడీ అధికారులు నిందితులుగా చేర్చలేదు. అయితే సీఐడీ  అధికారులు విచారణకు హాజరుకావాలని 41ఏ నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలోనే కిలారు రాజేష్ నేడు సీఐడీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు.

Latest Videos

ఇక, స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును సీఐడీ అరెస్ట్ తర్వాత.. కిలారు రాజేష్ హైకోర్టును ఆశ్రయించారు. స్కిల్ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరగగా.. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో ఇప్పటి వరకు కిలారు రాజేష్ పేరును నిందితుడిగా చేర్చలేదని సీఐడీ అధికారులు తెలిపారు. అతడిని ఈ కేసులో చేరిస్తే సీఆర్‌పీసీ 41ఏ కింద నోటీసులు జారీ చేసి విచారిస్తామని చెప్పారు. ఈ క్రమమంలోనే కిలారు రాజేష్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను హైకోర్టు మూసివేసింది.

vuukle one pixel image
click me!