25 ఏళ్ల భూమా అధిపత్యానికి షాక్: మాజీ బ్రహ్మానందరెడ్డిపై కిడ్నాప్ కేసు

By telugu teamFirst Published Jan 28, 2021, 7:38 AM IST
Highlights

కర్నూలు డెయిరీ ఎన్నికల్లో 25 ఏళ్ల భూమా కుటుంబం ఆధిపత్యానికి తెర పడింది. అదే సమయంలో మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత భూమా బ్రహ్మానంద రెడ్డిపై కిడ్నాప్ కేసు నమోదైంది.

నంద్యాల: కర్నూలు జిల్లా విజయ డెయిరీ ఎన్నికల్లో భూమా కుటుంబానికి షాక్ తగిలింది. అదే సమయంలో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డిపై కిడ్నాప్ కేసు నమోదైంది. ఆయనతో పాటు విజయ డెయిరీ మాజీ చైర్మన్ భూమా నారాయణ రెడ్డి, భూమా వీరభద్రారెడ్డి, బాలీశ్వరరెడ్డిలపై కిడ్నాప్ కేసు నమోదు చేసినట్లు నంద్యాల త్రీటౌన్ సీఐ మోహన్ రెడ్డి బుధవారం తెలిపారు. 

నంద్యాల మండలం చాబోలు పాల సొసైటీ అధ్యక్షుడు మల్లికార్జున ఈ నెల 2వ తేదీన ఏవీ అపార్టుమెంట్ వద్ద ఉండగా వారందరూ కలిసి కారులో బలవంతంగా ఎక్కించుకుని వెళ్లారని పోలీసులు చెబుతున్నారు. దాదాపు 20 రోజుల పాటు హైదరాబాదులోనూ, తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లోనూ మల్లికార్జునను తిప్పారని అంటున్నారు. 

మల్లికార్జునతో తెల్ల కాగితాలపై, రిజిస్టర్ కాగితాలపై సంతకాలు చేయించుకుని వదిలేశారని చెబుతున్నారు. దీనిపై త్రీటౌన్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మల్లికార్డున ఫిర్యాదు మేరకు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

ఇదిలావుంటే, కర్నూలు జిల్లా విజయ డెయిరీ ఎన్నికల్లో వైసీపీ అనుకూల వర్గం విజయం సాధించింది. దివంగత నేత భూమా నాగిరె్డడి సమీప బంధువు భూమా నారాయణ రెడ్డి 25 ఏళ్లుగా చైర్మన్ గా కొనసాగుతున్ారు. అయితే, బుధవారం జరిగిన ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారులైన ముగ్గురు డైరెక్టర్లు భారీ మెజారిటీతో విజయం సాధించారు. కొత్తగా ఎన్నికనై ముగ్గురు డైరెక్టర్లతో పాటు పాత డైరెక్టర్లు నలుగురు వైసీపీ మద్దతుదారుడు ఎస్వీ జగన్మోహన్ రె్డడికి మద్దతు తెలిపారు. దీంతో జగన్మోహన్ రెడ్డి విజయ డెయిరీ చైర్మన్ గా ఎన్నికయ్యారు. 

click me!