ప్రేమపేరుతో వివాహిత కిడ్నాప్, అత్యాచారం.. ఫిర్యాదు చేయడంతో ఆత్మహత్యయత్నం..

Published : Sep 02, 2022, 11:56 AM IST
ప్రేమపేరుతో వివాహిత కిడ్నాప్, అత్యాచారం.. ఫిర్యాదు చేయడంతో ఆత్మహత్యయత్నం..

సారాంశం

వివాహితను కిడ్నాప్ చేసిన ఓ వ్యక్తి గదిలో బంధించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. చివరికి కుటుంబసభ్యులు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో తాను ఆమె ప్రేమించుకున్నామంటూ.. ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. 

జంగారెడ్డి గూడెం : వివాహితను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన యువతికి.. లక్కవరం గ్రామానికి చెందిన వ్యక్తితో నెల రోజుల కిందట వివాహమైంది. ఆగస్టు 6న ఆమె భర్తతో కలిసి పుట్టింటికి వచ్చింది. ఆ సమయంలో యువతికి గతంలో పరిచయమున్న శివకుమార్ ప్రేమిస్తున్నానని, నువ్వు లేకపోతే చచ్చిపోతా అని బెదిరించి.. మరో యువకుడు సహాయంతో బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకు వెళ్ళాడు. ఆ తరువాత తిరిగి జంగారెడ్డిగూడెం తీసుకొచ్చాడు. అక్కడే ఓ అపార్ట్మెంట్ లో ఉంచి, పలుమార్లు  అత్యాచారానికి పాల్పడ్డాడు.  

ఆ తర్వాత ఆమెను కొట్టడంతో పాటు కులం పేరుతో దూషించి.. ఇంటి వద్ద దించేశాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 29న రాత్రి శివకుమార్ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తాను, యువతి ప్రేమించుకున్నామని,  ఆమెకు పెళ్లి ఇష్టం లేదని ఇద్దరం ఇంటి నుంచి వెళ్లిపోయామన్నారు. యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారని తిరిగి తిరిగి వచ్చామన్నారు. ఆ తర్వాత తనపై కేసులు పెట్టించారని ఓ మధ్యవర్తి కేసు రాజీ కి డబ్బులు అడుగుతున్నారని తెలిపారు. దీంతో మనస్థాపం చెంది ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు చెప్పాడు. 

ప్రకాశంలో గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న లారీలో మంటలు: దగ్ధమైన 100 గ్యాస్ సిలిండర్లు, ట్రాఫిక్ నిలిపివేత

ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటనే జూలైలో హైదరాబాద్ లో చోటు చేసుకుంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి కోర్కెలు తీర్చుకుని బ్లాక్మెయిల్కు పాల్పడిన వ్యక్తిపై ఎస్సార్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ సైదులు సమాచారం మేరకు ఏపీలోని మచిలీపట్నంకు చెందిన పార్వతి టైలరింగ్ చేస్తూ బీకేగూడ ఎస్ఆర్ నగర్ లో ఉంటుంది. భర్త తో విడిపోయిన ఆమె.. కూతురుతో కలిసి రెండు సంవత్సరాల క్రితం చందానగర్ లో ఉన్న సమయంలో అమర్ తేజ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. పెళ్లి చేసుకుని నీ కూతురును కూడా బాగా చూసుకుంటాను.. అని నమ్మించి ఆరు నెలలపాటు ఆమెతో సహజీవనం చేశాడు. 

అయితే, ఆ తరువాత అమర్ తేజకు వివాహం జరిగినట్లు తెలియడంతో పార్వతి అతడిని నిలదీసింది. ఇధి మనసులో పెట్టుకుని ఆమెను వేధిస్తుండడంతో.. బాధితురాలు చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.  దీంతో పోలీసులు వారిద్దరికీ కౌన్సెలింగ్ చేసి పంపించారు. అయినా అతనిలో మార్పు రాలేదు. దీంతో  అక్కడి నుంచి ఆమె బి.కె గూడాకు వచ్చి ఉంటుంది. గతంలో ఆమెతో ఉన్న సమయంలో దిగిన ఫోటోలను చూపించి.. తన వద్దకు రావాలని.. లేదంటే ఫోటోలను మీ బంధువులకు పంపుతానని బెదిరించడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ సైదులు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Fire Service వారోత్సవాల్లో DGP Harish Kumar Gupta | Fire Service Vehicles | Asianet News Telugu
Perni Nani press meet: మోయ‌లేని గుదిబండగా అమ‌రావ‌తి చంద్రబాబుపై పేర్నినాని సెటైర్లు | Asianet Telugu